Sumit Nagal: సీడెడ్ ప్లేయ‌ర్‌కు షాకిచ్చిన‌ నాగ‌ల్.. రెండో భార‌తీయుడిగా రికార్డు

Sumit Nagal Becomes Second Indian To Beat Seeded Player In Grand Slam
x

Sumit Nagal: సీడెడ్ ప్లేయ‌ర్‌కు షాకిచ్చిన‌ నాగ‌ల్.. రెండో భార‌తీయుడిగా రికార్డు

Highlights

Sumit Nagal: సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా గుర్తింపు

Sumit Nagal: భార‌త టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్ట్రేలియన్ ఓపెన్ లో బోణీ కొట్టాడు. తొలి రౌండ్‌లో క‌జ‌కిస్థాన్ ఆట‌గాడు అలెగ్జాండ‌ర్ బ‌బ్లిక్ పై గెలుపొందాడు. మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో తొలి సెట్ నుంచి ధాటిగా ఆడిన 31వ‌ ర్యాంక‌ర్ నాగ‌ల్ 6-4, 6-2, 7-6తో బ‌బ్లిక్‌ను చిత్తు చేశాడు. ఈ విజ‌యంతో నాగ‌ల్ మూడేండ్ల త‌ర్వాత ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. అంతేకాదు గ్రాండ్‌స్లామ్ చ‌రిత్రలో సీడెడ్ ప్లేయ‌ర్‌ను ఓడించిన రెండో భార‌తీయుడిగా నాగ‌ల్ రికార్డు నెల‌కొల్పాడు. 1988లో ర‌మేశ్ కృష్ణ‌న్ తొలిసారి ఈ ఫీట్ సాధించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories