స్వీయ నిర్బంధంలోకి శ్రీలంక మాజీ క్రికెటర్

స్వీయ నిర్బంధంలోకి శ్రీలంక మాజీ క్రికెటర్
x
Kumar Sangakkara (file photo)
Highlights

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది.

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు ఈ వైరస్ శ్రీలంకను కూడా తాకింది. విదేశాల నుంచి వచ్చిన వారికి ఈ వైరస్ ఎక్కువగా వస్తుండడంతో ఏ దేశం నుంచి ఎవరు తిరిగొచ్చినా క్వారంటైన్‌ అవ్వాలని అన్ని దేశాలు నిబంధనలను వెల్లడించాయి. ఈ నేపధ్యంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ విషయాన్ని అయన వెల్లడించారు.

వారం రోజుల క్రితమే నేను లండన్‌ నుంచి వచ్చాను. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మార్చి 1-15 మధ్య విదేశాల నుంచి వచ్చినవారు పోలీసుల వద్ద పేరు నమోదు చేసుకోవాలని, క్వారంటైన్‌ వెళ్లాలని వార్తల్లో చూశాను.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాను. 'నాకెలాంటి లక్షణాలు కనిపించలేదు. అలాంటిదేమీ లేదు. " అని సంగక్కర పేర్కొన్నారు" ఇక ఇప్పటివరకు శ్రీలంకలో కొవిడ్‌-19 కేసులు 80 వరకు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories