ఆ చిరునవ్వు వెనుక బాధ దాగివుంది..

ఆ చిరునవ్వు వెనుక బాధ దాగివుంది..
x
Kumar sangakkara(File photo)
Highlights

భారత క్రికెట్ జట్టు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌ని రెండోసారి కైవసం చేసుకుంది.

భారత క్రికెట్ జట్టు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2011లో వన్డే ప్రపంచకప్‌ని రెండోసారి కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నువాన్‌ కులశేఖర బౌలింగ్‌లో 49వ ఓవర్‌ రెండో బంతికి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ విన్నింగ్ షాట్ అపురూపం. నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న యువరాజ్ సింగ్ పరిగెత్తుకుంటూ వచ్చి ధోనీని హత్తుకున్న సమయం.

అయితే శ్రీలంక జట్టు మ్యాచ్ ఓడినా శ్రీలంక కెప్టెన్‌ కుమార సంగక్కర చిరునవ్వు చిందిస్తూ నడుచుకుంటూ వచ్చాడు. ప్రపంచకప్‌ చేజారినా.. గుండెల్లోని బాధను దిగమింగుకుంటూనే చిరునవ్వుతో ఆ ఓటమిని స్వీకరించాడు. లంక అభిమానులతో సహా, యావత్‌ క్రీడా ప్రపంచం సంగక్కర క్రీడా స్పూర్తికి సెల్యూట్‌ చేసింది. ఆ ఫొటో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ విషయాన్ని రవిచంద్రన్‌ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడిన సంగక్కర 2011 వన్డే ప్రపంచకప్‌ నాటి విశేషాలను పంచుకున్నాడు.

ఈ విషయాన్ని సంగక్కర వెల్లడిస్తూ.. మేం మ్యాచ్‌ ఆడినప్పుడల్లా గెలవాలనే అనుకుంటాం. మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా.. ఆ ఫలితాన్ని ఎలా స్వీకరించాలి.. అనేదానిపైనే దృష్టిసారిస్తాం.. 30 ఏళ్లుగా శ్రీలంకలో నివసిస్తున్నాను (అప్పుడు). ఇబ్బందులు పడిన సందర్బాలు అనేకం. యుద్దాలు జరిగాయి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. అయినా కూడా శ్రీలంకలో ఉన్న గొప్ప విషయం.. దేని నుంచైనా త్వరగా కోలుకొని పూర్వస్థితికి చేరుకోవాలి అనే విషయం నా దేశం నేర్పింది. ఇదే సూత్రాన్ని మేం క్రికెట్‌ ఆడేటప్పుడు కూడా అవలంభిస్తాం' అని సంగక్కర వెల్లడించాడు. చిరునవ్వు వెనుక నిరాశతో కూడిన ఎంతో బాధను కప్పిపుచ్చింది. అని సంగక్కర వెల్లడించారు.

వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మహేల జయవర్దనె (103 నాటౌట్) అజేయ సెంచరీ చేసాడు. లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. విరాట్ కోహ్లీ (35), గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4)తో కలిసి ఎంఎస్ ధోనీ (91 *) లుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గంభీర్ ఔటైనా.. యువరాజ్ సింగ్‌తో కలిసి 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్‌ని ధోనీ ముగించాడు. టీమిండియా ప్రపంచం కప్ కల నెరవేరింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories