Sri Lanka Cricket Board: శ్రీలంక క్రికెట్‌ బోర్డును పునరుద్ధరించిన కోర్టు..!

Sri Lanka Court Restores Sacked Cricket Board
x

Sri Lanka Cricket Board: శ్రీలంక క్రికెట్‌ బోర్డును పునరుద్ధరించిన కోర్టు..!

Highlights

Sri Lanka Cricket Board: రోషన్ రణసింఘె నిర్ణయాన్ని కొట్టివేసిన కోర్టు

Sri Lanka Cricket Board: శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అప్పీళ్ల కోర్టు కొట్టివేసింది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు పునరుద్ధరించినట్లయింది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ పెండింగ్‌లో ఉండటంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. క్రీడా మంత్రి రోషన్ రణ సింఘె నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. రోషన్ రణసింఘె నిర్ణయాన్ని కొట్టివేసింది. సిల్వా పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణను పెండింగ్‌లో ఉంచింది. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ప్రస్తుతానికి బోర్డును రెండు వారాలపాటు పునరుద్ధరించారని కోర్టు అధికారులు తెలిపారు. జట్టు మాజీ కెప్టెన్ అర్జున తణతుంగ ఆధ్వర్యంలో కొత్త కమిటీ విధులను చేపట్టకుండా బోర్డు ఆపినట్లయింది. ఇక ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు విధుల్లో తిరిగి చేరాల్సి ఉందని అధికారులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories