SRH: హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌ చేరాలంటే ఇలా చేయాలి.. లేదంటే లగేజీ సర్ధుకోవడమే!

SRH
x

SRH: హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌ చేరాలంటే ఇలా చేయాలి.. లేదంటే లగేజీ సర్ధుకోవడమే!

Highlights

Sunrisers Hyderabad: తమ తప్పులను సరిదిద్దుకుంటే ఆశలు తిరిగి చిగురించవచ్చు. లేదంటే ఈ సీజన్‌ కూడా ఆరెంజ్ ఆర్మీకి మరింత నిరాశను మిగిల్చే అవకాశం ఉంది.

Sunrisers Hyderabad: వామ్మో.. ఉప్పల్‌లో ఉప్పెన సృష్టిస్తారన్నారు.. ఫ్యాన్స్‌ అంతా SRH కమ్‌బ్యాక్‌ ఇస్తుందని వాట్సాప్‌ స్టేటస్‌లు పెట్టారు.. గుజరాత్‌పై మ్యాచ్‌లో కావ్యమారన్‌ నవ్వులు మాత్రమే కనిపిస్తాయని కొందరు జోస్యం చెప్పారు.. కానీ అవేవీ జరగలేదు..! ఫ్యాన్స్‌ పరువు హుస్సెన్‌ సాగర్‌లో కలిసిపోయింది. SRH మరోసారి ఘోరంగా ఓడిపోవడం ఫ్యాన్స్‌ను కలిచివేసింది. హాట్ ఫేవరేట్‌గా.. డిఫెండింగ్ రన్నరప్‌గా ఈ సీజన్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్..పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ అవకాశాలను కష్టం చేసుకుంది.

ఐపీఎల్ 2025 సీజన్‌ ప్రారంభాన్ని రాజస్థాన్‌పై సంచలన విజయంతో ఘనంగా మొదలుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ ఉత్సాహాన్ని కొనసాగించలేక పోయింది. ఆ మ్యాచ్‌లో 286 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి పటిష్టమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించినా, తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం తీవ్రంగా విఫలమైంది. వరుసగా లక్నో, ఢిల్లీ, కోల్‌కతా, గుజరాత్ జట్ల చేతిలో ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది.

ఈ పరాజయాల వెనుక ప్రధాన కారణం బ్యాటింగ్ విఫలం. మొదటి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన బ్యాటర్లు తర్వాత ఆటల్లో పూర్తిగా విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి బ్యాటర్లు అనూహ్యంగా రాణించలేకపోయారు. నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా 200 పరుగుల మైలురాయిని దాటి రాలేకపోవడం దానికి నిదర్శనం. దాంతో పాటు బౌలింగ్ డిపార్ట్‌మెంట్ కూడా పూర్తిగా ఆడిపడిపోయింది. స్పిన్నర్ల మద్దతు లేకపోవడం, షమీ, కమిన్స్ లాంటి సీనియర్ బౌలర్లు దారుణంగా తేలిపోవడం, ఇతరులనుండి సహకారం లేకపోవడంతో జట్టు తలదించుకుంది.

ఇప్పుడు లీగ్ దశలో సన్‌రైజర్స్‌కు మిగిలిన 9 మ్యాచ్‌లు అతి కీలకం. ప్లే ఆఫ్స్‌కి చేరాలంటే వీటిలో కనీసం 8 విజయాలు అవసరం. ఇది సాధించగలిగితేనే 18 పాయింట్లతో టైటిల్ పోరులో నిలవగలుగుతుంది. ఒకవేళ ఇంకా రెండు మ్యాచ్‌లు కూడా ఓడిపోతే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం నెట్ రన్‌రేట్ కూడా దయనీయ స్థితిలో ఉండటంతో విజయం మాత్రమే కాదు, పరుగుల తేడాతో గెలవడం కూడా కీలకం అవుతుంది. మరికొన్ని మ్యాచ్‌లు ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాల్సి వస్తుంది.

ఈ సంక్షోభ స్థితిలో నుంచి బయటపడాలంటే టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముందుకు రావాలి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆటగాళ్లు తమ ఫామ్‌ను తిరిగి పొందాల్సిన అవసరం ఉందంటూ అభిమానులు ఆశిస్తున్నారు. భారీ స్కోర్లు సాధించినట్లైతే బౌలర్లపై ఒత్తిడి తగ్గి వారు తమ రీతిలో రాణించగలుగుతారు. ఇప్పుడు అయినా జట్టు తమ తప్పులను సరిదిద్దుకుంటే ఆశలు తిరిగి చిగురించవచ్చు. లేదంటే ఈ సీజన్‌ కూడా ఆరెంజ్ ఆర్మీకి మరింత నిరాశను మిగిల్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories