SRH vs RR: చిత్తుగా ఓడిన రాజస్థాన్‌.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్

SRH beat RR, SRH won by 36 runs
x

SRH vs RR: చిత్తుగా ఓడిన రాజస్థాన్‌.. ఫైనల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్

Highlights

SRH vs RR: ఫైనల్‌లో కోల్‌కతాతో తలపడనున్న హైదరాబాద్

SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్-17వ సీజన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నైలో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టీమ్ 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఈ విజయంతో ఫైనల్ చేరిన సన్‌రైజర్స్... ఈ నెల 26న జరిగే టైటిల్ సమరంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ప్లేఆఫ్స్‌లో కోల్‌కతాతో క్వాలిఫయర్-1లో ఓడిపోయిన సన్‌రైజర్స్... ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంటుందా? అనే అంశం ఆసక్తి కలిగిస్తోంది. ఫైనల్ మ్యాచ్ కూడా చెన్నైలోనే జరగనుంది.

ఇక నేటి క్వాలిఫయర్-2 మ్యాచ్ విషయానికొస్తే... చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం, లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.

సన్‌రైజర్స్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పారు. కెప్టెన్ పాట్ కమిన్స్ 1, టి.నటరాజన్ 1 వికెట్ తీసి జట్టు విజయంలో తమ వంతు సహకారం అందించారు.

రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్ 56 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 42 పరుగులు చేశాడు. ఓపెనర్ టామ్ కోహ్లర్ కాడ్మోర్, కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రోన్ హెట్మెయర్, రోమాన్ పావెల్ విఫలమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories