Top
logo

జైలు జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన క్రికెటర్

జైలు జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన క్రికెటర్
Highlights

భారత జట్టు వర్థమాన క్రికెటర్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన జైలు జీవితం గడిపిన ఆనాటి పరిస్థితుల గుర్తు చేసుకున్నారు. థిహార్‌ జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు పోలీసు సిబ్బంది తనను నేరస్తుడిగా చూశారన్నారు. మాటలతో వేధించేవారని వెల్లడించారు.

భారత జట్టు వర్థమాన క్రికెటర్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన జైలు జీవితం గడిపిన ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. థిహార్‌ జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు పోలీసు సిబ్బంది తనను నేరస్తుడిగా చూశారన్నారు. మాటలతో వేధించేవారని వెల్లడించారు. హంతకుడిగా వారు భావించేవారని భావోద్వేగంతో తెలిపాడు. జైలు జీవితంలో మానసికంగా కృంగిపోయానని అన్నారు.


భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించించాడు. శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు సహా 10 టీ20 మ్యాచ్‎లు ఆడాడు. ఐపీఎల్ 2013 సీజన్‎లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు, అయితే సహా ఆటగాడు అంకిత్ చవాన్, చండీలా‎లతో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆరోపణల్లో సంవత్సర కాలం పాటు జైలు శిక్ష అనుభవించాడు. జీవితకాలం నిషేదం ఎదుర్కొన్న అతడు సుప్రీంకోర్టులో తన వాదనలను వినిపించగా కోర్టు అతడి శిక్షను ఏడేళ్లకు కుదిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story

లైవ్ టీవి


Share it