ఆసోం సర్కార్ కీలక నిర్ణయం.. స్ప్రింటర్‌ హిమదాస్‌కు డీఎస్పీ పదవి

sprinter Hima das appointed dsp
x

sprinter Hima das appointed dsp

Highlights

స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ను డీఎస్పీ పదవి వరించింది. హిమదాస్‌ సేవలకుగాను డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్‌గా నియమించాలని ఆసోం సీఎం సర్బానంద సోనోవాల్‌...

స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ను డీఎస్పీ పదవి వరించింది. హిమదాస్‌ సేవలకుగాను డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్‌గా నియమించాలని ఆసోం సీఎం సర్బానంద సోనోవాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆసోం సీఎం సర్బానంద సోనోవాల్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. లీస్‌, ఎక్సైజ్, రవాణా తదితర వివిధ విభాగాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఆఫీసర్లుగా క్రీడాకారులను నియమించడం ద్వారా రాష్ట్రంలో సమీకృత క్రీడా విధానాన్ని సవరించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవరి మీడియాకు తెలిపారు

రాష్ట్రంలో సమీకృత క్రీడా విధానాన్ని సవరించాలని నిర్ణయంతో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1 ఆఫీసర్లుగా నియమించనున్నట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల ఈ అస్సామీ స్టార్‌ స్పింటర్‌ హిమదాస్‌ 2018లో అద్భుతంగా రాణించింది. ఫిన్లాండ్‌లో జరిగిన అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌ 400మీటర్ల ఈవెంట్‌లో బంగారు పతకం సాధించింది.‎ అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ఇదే చాంపియన్‌షిప్‌లో రిలేలో మరో స్వర్ణం, మిక్స్‌డ్‌ రిలేలో రజతం హిమా ఖాతాలో చేరాయి. ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ అండర్‌-20 స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్‌గా హిమదాస్‌ రికార్డు సాధించింది

Show Full Article
Print Article
Next Story
More Stories