SA vs AFG: ఆఫ్ఘనిస్తాన్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం

South Africas Big Win Over Afghanistan
x

SA vs AFG: ఆఫ్ఘనిస్తాన్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం

Highlights

SA vs AFG: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా జరిగిన మూడో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్ లో బోణి కొట్టింది.

SA vs AFG: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా జరిగిన మూడో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్ లో బోణి కొట్టింది. కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో అఫ్ఘనిస్తాన్ పై 107 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షఇణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలుత బ్యాటింగ్ లో దుమ్ము రేపిన సఫారీలు.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ బెంబేలెత్తించారు.

43.3 ఓవర్లలో 208 పరుగులకు ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అయ్యింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా (90) ఒంటరి పోరాటం చేసినా… ఫలితం లేకుండా పోయింది. రహమత్ షా మినహా మరే ఆటగాడు కనీసం 20 పరుగులు కూడా చేయకుండా పెవిలియన్ చేరాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ మూడు వికెట్లు తీయ‌గా.. లుంగీ నిగిడి, వియాన్ ముల్డర్ రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇక‌ మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ ద‌క్కించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories