IND vs SA ODI Series : టీమిండియా కెప్టెన్సీ రేసులో ఐదుగురు

IND vs SA ODI Series : టీమిండియా కెప్టెన్సీ రేసులో ఐదుగురు
x
Rahul, Manish Pandey File Photo
Highlights

కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి తీసుకుంటే, వైస్ కెప్టెన్‌ రోహిత్ శర్మ కాళ్ల కండరాలు పట్టేయడంతో ఇప్పటికే అర్థాంతరంగా కివీస్ సిరీస్‌కుదూరమైయ్యాడు.

న్యూజిలాండ్‌లో దైపాక్షిక సిరీస్ ముగిసిన అనంతరం భారత్ తన తర్వాత సిరీస్ స్వదేశంలో సౌతాఫ్రికా ఆడనుంది. అయితే దక్షిణాఫ్రికాతో ఆడబోయే మూడు వన్డేల సిరీస్‌ లో మెనేజ్‌మెంట్‌కు పెద్ద సమస్య వచ్చింది. తీరిక‌లేని షెడ్యూల్‌, కార‌ణంగా ఫామ్ అందుకోవడంలో సతమతమవుతోన్న కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి తీసుకుంటే, వైస్ కెప్టెన్‌ రోహిత్ శర్మ కాళ్ల కండరాలు పట్టేయడంతో ఇప్పటికే అర్థాంతరంగా కివీస్ సిరీస్‌కుదూరమైయ్యాడు. రోహిత్ శర్మ కూడా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ సిరీస్‌లో టీమిండియా సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పగించాలని విషయంలో సెలక్టర్లు పెద్ద సమస్య వచ్చిందట. ఈ సిరీస్‌లో ఇలా కెప్టెన్‌, వైస్‌కెప్టెన్‌ లేకుండా 5ఏళ్ల తరువాత భారత్ బరిలోకి దిగనుంది.

మరోవైపు కెప్టెన్సీ రేసులో ఐదుగురు ఆటగాళ్లు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. శిఖర్‌ధావన్‌, మనీష్ పాండే, లోకేష్‌రాహుల్, శ్రేయాస్‌ అయ్యర్‌. అయితే వీరిలో సినీయర్ ఆటగాడు ధావన్ వైస్ కెప్టెన్‌గా 2018 నిదాహ‌స్ ట్రోఫీ, ఆసియాక‌ప్‌ల్లో వ్యవ‌హ‌రించారు. ఇటీవల స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో గాయంతో బాధపడినా.. ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించాడని సమాచారం. గ‌తంలో ఇండియా-ఎ, ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ జ‌ట్లకు నాయ‌క‌త్వం వ‌హించిన అనుభవం ఉంది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణిస్తున్న మరో కీలక ఆటగాడు కేఏల్ రాహుల్. లోకేష్‌ రాహుల్ ఏ స్థానంలో వచ్చిన తనంటే నిరుపించుకున్నాడు. ఒత్తిడిలోనూ చక్కగా రాణిస్తున్నాడు. రాహుల్ కి కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. ఐపీఎల్ 2020లో త‌ను కింగ్స్ లెవ‌న్ పంజాబ్‌కు నేతృత్వం వ‌హిస్తున్నాడు. కివీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌ ఐదో టీ20లో రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిచాడు.

మరోవైపు వీరిద్దరికి పోటీగా శ్రేయాస్‌ అయ్యర్ ఉన్నాడు. శ్రేయాస్‌ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఆటగాడు కావడంతో సెలెక్షన్ కమిటీ అతనిపై దృష్టి పెట్టకపోవచ్చు. అయితే కొందరు సభ్యులు అతని మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. అయ్యార్ జూనియర్‌ లెవల్‌ క్రికెట్‌లో సారథిగా వ్యవహరించిన అనుభవం అతనికి ఉందని, ఇండియా-ఎ జట్టును న్ని ఫార్మాట్లలో నడిపిస్తున్నాడు, అలాగే ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు నాయకత్వం వహిస్తున్నాడు. విజ‌య్ హ‌జారే ట్రోఫీ ముంబైకి అందించడంతో కీలక పాత్ర పోషించాడు.

సెక్షన్ కమిటీ ఈ ముగ్గురు కాకుండా, మనీష్ పాండే, సినీయర్ ఆటగాడు జడేజాపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆల్ రౌండర్‌గా జడేజా రాణించడంతోపాటు ప్రస్తుతం జట్టులోని అందరికంటే సినీయర్ కావడం, దక్షిణాఫ్రికాపై అనేక సిరీస్ లు ఆడిన అనుభవం అతనికి ఉంది. దీంతో సెలక్షన్ కమిటీ జడేజా వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మ‌నీశ్ పాండేకు కెప్టెన్‌గా అద్భుత‌మైన రికార్డు ఉంది. స‌య్యద్ ముస్తాక్ అలీ, విజ‌య్ హ‌జారే టోర్నీల‌లో క‌ర్ణాట‌కు విజేత‌గా నిలిపాడు. ఇండియా-ఎ జట్టుకు కెప్టెన్సీ వ‌హించిన అన్ని మ్యాచ్‌ల‌ను గెల‌వ‌డం విశేషం. 2019లో పాండే సారథ్యంలోనే 16 మ్యాచ్‌ల్ని గెలుపొంద‌డం గమనార్హం.

భారత్ సౌతాఫ్రికా మధ్య మార్చి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే 12న ధర్మశాలలో, రెండో వన్డే 15న ల‌క్నో, మూడో వన్డే 18న కోల్‌క‌తాలో జ‌రుగనున్నాయి. అయితే.. విరాట్‌ కోహ్లీకు విశాంత్రినిచ్చి, రోహిత్ గనుక ఫిట్‌గా లేకపోతే..వీరిలో ఒకరు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories