హమ్మయ్య..శ్రీలంక 200 దాటింది!

హమ్మయ్య..శ్రీలంక 200 దాటింది!
x
Highlights

నత్త నడక బ్యాటింగ్.. వికెట్లు పడకుండా కాచుకోవదానికే ప్రాధాన్యమిచ్చిన లంక బ్యాట్స్ మెన్. బంతితో ఇబ్బంది పెట్టిన దక్షిణాఫ్రికా బౌలర్లు. రెండొందలు...

నత్త నడక బ్యాటింగ్.. వికెట్లు పడకుండా కాచుకోవదానికే ప్రాధాన్యమిచ్చిన లంక బ్యాట్స్ మెన్. బంతితో ఇబ్బంది పెట్టిన దక్షిణాఫ్రికా బౌలర్లు. రెండొందలు పరుగులు దాటించారు శ్రీలంక బ్యాట్స్ మెన్. వికెట్లు పడిపోతుంటే ఆత్మరక్షణాత్మక ధోరణిలో సాగిన బ్యాటింగ్ తో లంకేయులు కనీసం రెండొందల పరుగులు చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు. అయితే, 37 ఓవర్లకు లంక 136/6తో ఉన్న స్కోరును పెరీరా, జీవన్‌ మెండిస్‌ మెల్లగా ముందుకు కదిలించారు. డుమిని వేసిన 39వ ఓవర్‌లో లంక మొత్తం 14 పరుగులు చేసి స్కోరు 150 దాటించారు. క్రిస్‌మోరిస్‌ వేసిన 40 వ ఓవర్‌లో భారీ షాట్‌ ఆడబోయి జీవన్‌ మెండిస్‌ (18; 46 బంతుల్లో) ప్రిటోరియస్‌ చేతికి చిక్కాడు. పెరీరా నిలకడగా ఆడుతుంటే, ఇసురు ఉదాన అతడికి సహకరించాడు. దీంతో 44వ ఓవర్‌ పూర్తయ్యేసరికి ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న థిసారా పెరీరా (21; 25) ఫెలుక్వాయో బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి రబాడా చేతికి చిక్కాడు. దీంతో 46 ఓవర్లకు లంక స్కోర్‌ 188/8గా నమోదైంది. 49 ఓవర్ లో ఇసురు ఉదాన (17; 32) ఔటయ్యాడు. చివరి ఓవర్లో మలింగ ఆడిన షాట్‌ను డు ప్లెసిస్‌ క్యాచ్‌ పట్టడంతో శ్రీలంక ఇన్నింగ్స్‌ 203 పరుగుల వద్ద ముగిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories