Quinton De Kock: తప్పు నాదే.. క్షమించండి.. ఇకపై మోకాళ్ళపై కూర్చుంటా

South Africa Player Quinton De Kock Says Sorry About the Issue of Black Lives Matter Protest in T20 World Cup 2021
x

Quinton De Kock: తప్పు నాదే.. క్షమించండి.. ఇకపై మోకాళ్ళపై కూర్చుంటా

Highlights

* దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు క్షమాపణలు చెప్పిన డికాక్

Quinton De Kock: టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌ కు ముందు దక్షిణాఫ్రికా ఓపెనర్, కీపర్ క్వింటన్‌ డికాక్‌ తన వ్యక్తిగత కారణాలతో పక్కకు తప్పుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. "బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్" ఉద్యమానికి మద్దతు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే క్వింటన్‌ డికాక్‌ మ్యాచ్ కి దూరంగా ఉన్నాడని పలువురు మాజీ ఆటగాళ్ళు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలిపారు.

వెస్టిండీస్‌తో మ్యాచ్‌ కు ఆటగాళ్లందరూ మోకాళ్లపై కూర్చుని సంఘీభావం తెలపాలని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు హుకుం జారీ చేయడం అందుకు క్వింటన్‌ డికాక్‌ దూరంగా ఉండటంతో దక్షిణాఫ్రికా క్రికెట్ లో పెద్ద దుమారం రేపింది. అటు క్వింటన్‌ డికాక్‌ చేసిన పనికి ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కూడా జట్టు నుండి రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.

అంతేకాకుండా అటు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులోను అతడి స్థానంపై సందిగ్ధం నెలకొనడంతో క్వింటన్‌ డికాక్‌ దిగొచ్చాడు. "బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్" విషయంలో తనని బలవంతంగా మోకాళ్ళపై కూర్చోమని మద్దతు తెలిపమని చెప్పడం తనకి నచ్చలేదని అందుకే అలా చేయలేదని..ఒకవేళ అలా చేస్తే వర్ణ వివక్షపై పరిస్థితి మారుతుందని అనుకుంటే తప్పకుండా చేస్తానని క్షమాపణలు చెబుతూ ఇకపియా మోకాళ్ళపై కూర్చుంటానని తెలిపాడు క్వింటన్‌ డికాక్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories