
South Africa Team: మ్యాచ్ టై అయితే దక్షిణాఫ్రికాదే విజయం.. అఫ్గాన్‌కు మాత్రం మూడు చేదు అనుభవాలు!
South Africa Team: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టై మ్యాచ్‌లు చాలా అరుదు. అందులోనూ టీ20 వరల్డ్‌కప్‌లలో మ్యాచ్ టై అవ్వడం ఇంకా అరుదనే చెప్పాలి.
South Africa Team: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టై మ్యాచ్‌లు చాలా అరుదు. అందులోనూ టీ20 వరల్డ్‌కప్‌లలో మ్యాచ్ టై అవ్వడం ఇంకా అరుదనే చెప్పాలి. అయితే టై అయిన మ్యాచ్‌లు సూపర్ ఓవర్ల రూపంలో అభిమానులకు అసలైన థ్రిల్‌ను అందిస్తాయి. అంతేకాదు టై అయిన మ్యాచ్‌లలో జట్ల రికార్డులు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్ల ఫలితాలు పరిశీలిస్తే.. మీరు షాక్ అవ్వక తప్పదు. మ్యాచ్ టై అయితే దక్షిణాఫ్రికాదే విజయం అనేలా గణాంకాలు చెబుతున్నాయి.
దక్షిణాఫ్రికా జట్టు టై అయిన మ్యాచ్‌లలో విజయవంతమైన రికార్డు కలిగి ఉంది. 2019లో కేప్‌టౌన్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ టైగా ముగిసినా.. సూపర్ ఓవర్‌లో ప్రోటీస్ జట్టు గెలిచింది. తాజాగా 2026 టీ20 వరల్డ్‌కప్‌లో అహ్మదాబాద్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ కూడా టై కాగా.. రెండో సూపర్ ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ రెండు సూపర్ ఓవర్లు అభిమానులకు మంచి మజాను ఇచ్చాయి. ఇప్పటివరకు టై అయిన రెండు మ్యాచ్‌లలోనూ సఫారీ జట్టు గెలుపు నమోదు చేసింది.
మరోవైపు అఫ్గానిస్థాన్‌కు టై మ్యాచ్‌లు చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. 2020లో నోయిడాలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ టై కాగా.. ఆ తరువాతి ఫలితంలో అఫ్గాన్ ఓటమి పాలైంది. 2024లో బెంగళూరులో భారత్‌తో జరిగిన మ్యాచ్ రెండో సూపర్ ఓవర్ వరకు వెళ్లగా.. అఫ్గానిస్థాన్ ఓడిపోయింది. తాజాగా 2026 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ కూడా రెండో సూపర్ ఓవర్‌లోనే చేజారింది. అంటే సూపర్ ఓవర్లు అఫ్గాన్ జట్టుకు కలిసిరావడం లేదు.
ఈ గణాంకాలు చూస్తే.. టై మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా ఒత్తిడిని బాగా ఎదుర్కొంటుందనేది స్పష్టమవుతోంది. అదే సమయంలో అఫ్గానిస్థాన్ కీలక సందర్భాల్లో ఒత్తిడితో పాటు అదృష్టం కలిసిరాక ఓటములను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ అఫ్గాన్ జట్టు ప్రతిసారి గట్టి పోరాటమే ఇస్తోంది. భవిష్యత్తులో టై మ్యాచ్‌లను విజయాలుగా మార్చుకునే సామర్థ్యం అఫ్గాన్ ఆటగాళ్లకు ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో అఫ్గాన్ జట్టు ఐసీసీ ఈవెంట్లలో మంచి ప్రదర్శన చేస్తోంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాను , ఇప్పుడు దక్షిణాఫ్రికాను వణికించింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




