కోహ్లీ , పుజారాపై నెటిజన్లు సెటైర్లు

కోహ్లీ , పుజారాపై నెటిజన్లు సెటైర్లు
x
Pujara And Kohli
Highlights

వెల్లింగ్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి భారత్‌ నాలుగు వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది.

వెల్లింగ్టన్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మద్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట నిలిచిపోయేసరికి భారత్‌ నాలుగు వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. టీమిండియా ఆదిక్యం చాలాయించాలంటే పోరాడాల్సి వుంది. అయితే ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.

కోహ్లీ, పుజారా ఔటైన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. బౌల్ట్‌ బౌలింగ్‌లో పుజారా క్లీన్‌బౌల్డ్‌ అవ్వగా.. కోహ్లీ వికెట్‌కీపర్ వాట్లింగ్‌ దొరికిపోయాడు. దీనిపై నెటిజన్లు సైటైర్లు పేలుస్తున్నారు. కోహ్లీ ఆ షాట్ ఆడివుడాల్సింది కాదని, వదిలేయాల్సిన దగ్గర ఆడటానికి ప్రయత్నించాడు కాబట్టే అతను ఔటైయ్యాడు. అలాగే పుజారా ఆడాల్సిన షాట్ ఆడకుండా క్లీన్ బౌల్డ్ అయ్యాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే న్యూజిలాండ్‌ పర్యటనలో విరాట్ కోహ్లీ తన పేలవ ఫామ్‌లో కొనసాగిస్తున్నాడు. కోహ్లీ గత ఇన్నింగ్స్‌ల్లో కేవలం 201 పరుగులే చేశాడు. దీనిలో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. వెల్లింగ్టన్‌ టెస్టులో రెండు ఇన్సింగ్స్ లో కలిపి 21 పరుగులే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులకే ఔట్ అయ్యాడు. 2018 ఇంగ్లాండ్‌ పర్యటనలో చెలరేగిన కోహ్లీ అనంతరం అంతగా ఆకట్టుకోలేకపోతన్నాడు. గత 20 ఇన్నింగ్స్ లో కోహ్లీ సెంచరీ చేయలేదు. అయితే కోహ్లీ 2015 పరిస్థితులు తిరిగి పునరావృతం అవుతున్నాయా అనే అనుమానాలు అభిమానుల్లో కలుగుతోంది.

ఇక అభిమానులు మాత్రం ఎవరిని వదలి పెట్టకుండా సైటైర్లు వేస్తు్న్నారు. నిరాశ‌జ‌న‌క ప్రద‌ర్శన పృథ్వీ షాపై విమర్శలు గుప్పిస్తు్న్నారు. టెస్టుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ డకౌట్‌తో సహా కేవ‌లం 39 ప‌రుగులే చేసి విఫ‌ల‌మ‌య్యాడు. పృథ్వీ షాను త‌న‌ను పక్క‌న పెట్టాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories