Smriti Mandhana : ఆసీస్​పై మంధాన రికార్డుల సునామీ..మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి 1000 వన్డే పరుగులు

Smriti Mandhana : ఆసీస్​పై మంధాన రికార్డుల సునామీ..మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి 1000 వన్డే పరుగులు
x

Smriti Mandhana : ఆసీస్​పై మంధాన రికార్డుల సునామీ..మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి 1000 వన్డే పరుగులు

Highlights

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వచ్చిందంటే చాలు, పరుగుల సునామీతో పాటు రికార్డుల వర్షం కురవాల్సిందే.

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వచ్చిందంటే చాలు, పరుగుల సునామీతో పాటు రికార్డుల వర్షం కురవాల్సిందే. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ 2025లో తొలి మూడు మ్యాచ్‌ల్లో కాస్త నిరాశపరిచినా, ఆస్ట్రేలియాపై జరిగిన కీలక పోరులో మాత్రం మంధాన తన పాత ఫామ్ అందుకుంది. ఈ పరుగుల వేటలో మంధాన మహిళల క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది. ఆస్ట్రేలియాపై 80 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడిన మంధాన.. ఈ సంవత్సరంలో వన్డే క్రికెట్‌లో ఏకంగా 1000 పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది.

విశాఖపట్నంలో అక్టోబర్ 12, ఆదివారం నాడు జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌కు ముందే మంధాన.. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. అయితే, ఆస్ట్రేలియాపై 80 పరుగులు చేయడంతో, ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1,000 వన్డే పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి మహిళా క్రికెటర్​గా చరిత్ర సృష్టించింది. మంధాన ఈ ఏడాది కేవలం 18 ఇన్నింగ్స్‌లలోనే ఈ అద్భుత ఘనత సాధించింది. 2025లో ఆమె ఇప్పటివరకు నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది.

అలాగే ఈ కేవలం 46 బంతుల్లోనే తన వరల్డ్ కప్​లో తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసింది. అలాగే, ఆమె స్కోరు 58 పరుగుల మార్క్ దాటగానే.. వన్డే క్రికెట్‌లో మొత్తం 5,000 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని చేరుకోవడంలో ఆమె మరో రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. మంధాన కేవలం 29 సంవత్సరాల 86 రోజుల్లో 5,000 వన్డే పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.

కేవలం 112 ఇన్నింగ్స్‌లు, 5,569 బంతులలో ఈ మైలురాయిని చేరుకున్న మంధాన, వన్డే క్రికెట్‌లో అతి వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ రికార్డును కూడా తన పేరిట రాసుకుంది. వెస్టిండీస్‌కు చెందిన స్టెఫానీ టేలర్ (129 ఇన్నింగ్స్‌లు), న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ (6,182 బంతులు) పేరిట ఉన్న రికార్డులను మంధాన బద్దలు కొట్టింది.

ఆస్ట్రేలియాపై మంధానకు సెంచరీ చేసే అవకాశం తృటిలో తప్పింది. ఆమె 66 బంతుల్లో 9 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి అవుట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసినప్పటికీ, ఈ ఏడాది ఆస్ట్రేలియాపై 1000 వన్డే పరుగులు పూర్తి చేసే అవకాశం మాత్రం 4 పరుగుల తేడాతో మిస్ చేసుకుంది. ప్రస్తుతం, మంధాన ఈ ప్రపంచ కప్​తో కలుపుకొని మొత్తం 20 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో 996 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories