సింధుకు ఘోర పరాభవం

PV Sindhu
x
PV Sindhu
Highlights

భారత షట్లర్‌ ప్రపంచ చాంపియన్ సింధును వరస పరాజయాల వెంటాడుతున్నాయి. ప్రపంచ విజేయత కిరీటం అందుకున్న తర్వాత సింధు పాల్గొన్న5 టోర్నీల్లో క్వార్టర్‌ ఫైనల్‌...

భారత షట్లర్‌ ప్రపంచ చాంపియన్ సింధును వరస పరాజయాల వెంటాడుతున్నాయి. ప్రపంచ విజేయత కిరీటం అందుకున్న తర్వాత సింధు పాల్గొన్న5 టోర్నీల్లో క్వార్టర్‌ ఫైనల్‌ దాటకపోవడం గమనార్హం. తాజాగా చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌750 తో మొదటి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టింది. మంగళవారం జరిగిన బ్యాడ్మింటన్‌ టోర్నీలో పాయ్‌ యు పో(చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. 42వ ర్యాంకర్‌ పాయ్‌ యు పో చేతిలో సింధు 3–21, 21–18, 19–21తో ఓడిపోయింది.

ఓ అనామక క్రిడాకారిని చేతిలో సింధు ఓడిపోడం పెద్ద షాక్ అని చెప్పాలి. ఇటీవలి కాలంలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ)తో తలపడిన సింధు రెండో రౌండ్‌లోనే గెలుపొందింది. కాగా ప్రపంచ టూర్ సూపర్ 750లో అమె చేతిలో ఓడిపోవడం దారుణ పరాభవంగా చెప్పాలి. ఓ దశలో సింధు 18–15తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. పుంజుకున్న పాయ్ యుపో తల ఆటతీరుతో సింధు పాయిుంట్లను అధిగమించింది. దీంతో సింధు వరసగా నాలుగు పాయింట్లు కోల్పోయి 18–19తో వెనుకబడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories