Shubman Gill: శుభ్‌మన్ గిల్ డబుల్ ధమాకా.. 4 సార్లు బ్రాడ్‌మన్‌ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్!

Shubman Gill: శుభ్‌మన్ గిల్ డబుల్ ధమాకా.. 4 సార్లు బ్రాడ్‌మన్‌ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్!
x
Highlights

Shubman Gill: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ అతడే.

Shubman Gill: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ అతడే. ఇప్పటివరకు 4 టెస్టుల్లో 8 ఇన్నింగ్స్‌లలో 722 పరుగులు చేశాడు. ఇంకొన్ని పరుగులు చేస్తే, 95 ఏళ్ల నాటి డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఓవల్‌లో జరిగే చివరి టెస్ట్‌లో గిల్ రెండు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడితే, బ్రాడ్‌మన్‌ను వెనక్కి నెట్టి ఒకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. గిల్ ఈ టెస్ట్‌లో బ్రాడ్‌మన్ రికార్డును ఏకంగా 4 సార్లు బద్దలు కొట్టే అవకాశం ఉంది.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే సిరీస్‌లో అత్యధికంగా 974 పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ పేరు మీద ఉంది. ఆయన ఈ రికార్డును 1930లో ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌లో సాధించారు. శుభ్‌మన్ గిల్ ఈ 95 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకా 253 పరుగులు దూరంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే చివరి టెస్ట్‌లో గిల్ ఈ అద్భుతాన్ని సృష్టించగలడు. ఒకవేళ గిల్ అలా చేస్తే, ఓవల్ టెస్ట్‌లో మొత్తం 4 సార్లు డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలు కొట్టినట్లు అవుతుంది.

ఒక టెస్ట్ సిరీస్‌లో 974 పరుగులు చేయడం అత్యధిక రికార్డు. డాన్ బ్రాడ్‌మన్ ఈ పరుగులు చేశారు. అయితే, శుభ్‌మన్ గిల్ ఈ రికార్డును చేరుకోవడానికి ముందు, డాన్ బ్రాడ్‌మన్ సృష్టించిన మరో మూడు పెద్ద రికార్డులను కూడా దాటాలి 1934లో యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌లో బ్రాడ్‌మన్ 758 పరుగులు చేశారు. 1931-32లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనలో బ్రాడ్‌మన్ 806 పరుగులు సాధించారు. 1936-37లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో యాషెస్ ఆడినప్పుడు, బ్రాడ్‌మన్ 5 టెస్టుల్లో 9 ఇన్నింగ్స్‌లలో 810 పరుగులు చేశారు.

శుభ్‌మన్ గిల్ బ్రాడ్‌మన్ 974 పరుగుల రికార్డును దాటాలి. అయితే, గిల్ 974 పరుగులను దాటుతున్నప్పుడు, బ్రాడ్‌మన్ సృష్టించిన పైన చెప్పిన మరో 3 రికార్డులను కూడా బద్దలు కొడతాడు. అంటే, ఇంగ్లాండ్‌తో ఓవల్‌లో జరిగే చివరి టెస్ట్‌లో గిల్ ఆడేది రెండు ఇన్నింగ్స్‌లే అయినా, అతడు బ్రాడ్‌మన్ రికార్డును 4 సార్లు బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుత ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ 4 టెస్టుల్లో 8 ఇన్నింగ్స్‌లలో 90.25 సగటుతో 722 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories