భారత్‌కు నాలుగో స్థానంలో బెంగ తీరినట్లేనా..?

భారత్‌కు నాలుగో స్థానంలో బెంగ తీరినట్లేనా..?
x
శ్రేయాస్ అయ్యర్
Highlights

వన్డే, టీ20 ఫార్మాట్‌లో మిడిల్ ఆర్డర్ ఎంతో కీలకం. అయితే టీమిండియా టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉప్పట్టికీ కొంత కాలంగా మిడిల్ ఆర్డర్ ఎవరిని తీసుకోవాలనే సమస్య ఎప్పటీకి అలానే ఉంది.

వన్డే, టీ20 ఫార్మాట్‌లో మిడిల్ ఆర్డర్ ఎంతో కీలకం. అయితే టీమిండియా టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉప్పట్టికీ కొంత కాలంగా మిడిల్ ఆర్డర్ ఎవరిని తీసుకోవాలనే సమస్య ఎప్పటీకి అలానే ఉంది. అయితే తాజాగా టీమిండియాకు శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో ఆ సమస్య తీరినట్లుగానే కనిపిస్తుంది. మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్ తర్వాత నాలుగో నంబర్ కోసం భారత్ క్రికెట్ జట్టు చాలా ప్రయోగాలు చేసింది.

రెండెళ్లుగా తొమ్మిది మంది బ్యాట్స్ మెన్ నాలుగో స్థానంలో రాణించడంలో విఫలమైయ్యారు. రెండేళ్ల క్రితం జట్టులోకి అడుగుపెట్టిన యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ జట్ట నాలుగో నెంబర్ స్థానంలో రాణిస్తూ కీలకంగా మారాడు. చాలా కాలంగా శ్రేయాస్ అయ్యర్‌కు సరైన అవకాశాలు రాలేదు. జట్టులో అవకాశాలపై మీడియా ముందు బాహటంగానే వెల్లడించారు. విండీస్ పర్యటనలో శ్రేయాస్ అయ్యర్ కు అవకాశం రావడంతో రాణించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ ఆటతీరుపై మాజీ ఆటగాళ్లు అనిల్‌కుంబ్లే, రవిశాస్త్రి, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 54 మ్యాచ్‌ల్లో 52.18 స్ట్రైక్ రేటుతో 12 సెంచరీలు , 23 అర్ధ సెంచరీలు చేశాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత 10 వన్డేలు ఆడి 52 సగటుతో 5 అర్ధ శతకాలు సాధించి, 416 పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో టీ20లో అర్ధ సెంచరీతో రాణించి తన ఆటతో అందరికి ఆకట్టుకున్నాడు. చపాక్ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్, రాహుల్, కోహ్లీ విఫలమైన తర్వాత 70 పరుగులు చేసి జట్టును ఆదుకోవడంతో కీలక పాత్ర పోషించాడు. రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు దీంతొ నాలుగో నంబర్ స్థానాన్ని శ్రేయస్‌ అయ్యర్‌ సరైన బ్యాట్స్‌మెన్ అనిపించుకున్నాడు. ఇక ఐపీఎల్లోనూ 2018లో గౌతమ్ గంభీర్‌ తప్పుకున్నాక ఢిల్లీ జట్టుకు సారధ్యం వహించాడు. 14 మ్యాచ్‌ల్లోనే 411 పరుగులు చేశాడు. ఇక 2019లో ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేశాడు. మంచి రాణించడమే కాకుండా కెప్టెన్‌గానూ ప్రశంసలు పొందాడు. ఢిల్లీని ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక విండీస్ పై జరుగుతున్న చివరి వన్డేలో శ్రేయస్స్ అయ్యార్ రాణిస్తే భారత్ కు తీరుగుండదు. రెండు వన్డేల్లో విజృంభించిన అయ్యార్ ఈ మ్యాచ్ లోనూ ఆదే ఆట తీరును కొనసాగిస్తే భారత్ కు నాలుగో స్థానంలో ఆటగాడు దొరికినట్లే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories