భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ నేనే కావచ్చు

భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ నేనే కావచ్చు
x
Shreyas Iyer
Highlights

టీమిండియా మిడిలాడ‌ర్డ‌ర్ బ్యాట్స్ మెన్ శ్రేయ‌స్స్ అయ్యార్ త‌న అంత‌రంగాన్ని బ‌య‌ట‌పెట్టాడు.

టీమిండియా మిడిలాడ‌ర్డ‌ర్ బ్యాట్స్ మెన్ శ్రేయ‌స్స్ అయ్యార్ త‌న అంత‌రంగాన్ని బ‌య‌ట‌పెట్టాడు. భవిష్య‌త్తులో టీమిండియాకు కెప్టెన్ అవుతనని అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం త‌న‌కు ఆ ఆలోచన లేదని,కానీ స‌మీప భ‌విష్య‌త్తులో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తాననే నమ్మకం ఉందన్నాడు. క్రిక్‌బజ్ స్పైసీ పిచ్‌ కార్యక్రమంలో మాట్లాడిన శ్రేయ‌స్స్.. అంత‌ర్జాతీయ జ‌ట్టలో అవకాశం వచ్చినప్పుడు భావోద్వేగానికి లోను కాలేద‌ని, ఆలస్యంగా త‌న‌కు భార‌త జ‌ట్టులో చేరే అవకాశం వచ్చిందన్నాడు.

అయితే టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తన ఆట మెరుగవ్వడానికి కారణమని ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు. నా బ్యాటింగ్‌ను రాహుల్‌ ద్రవిడ్‌ చూశారు. అది 4 రోజుల క్రికెట్‌ మ్యాచ్‌. తొలి రోజు చివరి ఓవర్‌లో ద్రవిడ్‌ నా ఆటను పరిశీలించారు. అప్ప‌టికే నేను 30 ర‌న్స్ చేసి ఉన్నా. అది చివరి ఓవర్‌ కావడంతో నివ‌దానంగా ఆడాలి, బ్యాట్‌పైకి వేసిన బంతిని బౌండ‌రీ త‌ర‌లించా.. దీంతో ద్రవిడ్‌ దృష్టిలో పడ్డా అని శ్రేయ‌స్స్ అన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టుకు గత ఐపీఎల్ సీజన్‌‌లో శ్రేయ‌స్స్ సారథ్య బాధ్యతలు వ‌హించాడు. కెప్టెన్సీతో జట్టును 3వ‌ స్థానంలో నిలిపాడు. 2012 నుంచి ఢిల్లీ క్వాలిఫైయర్స్‌కు తొలిసారి అర్హత సాధించింది. దీంతో అతని సార‌థ్యంపై ప్ర‌సంశ వ‌ర్షం కురిసింది. టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్య‌త‌లు వ‌హించ‌గ‌ల స‌త్తా అయ్యార్ కు ఉంద‌ని ప‌లువురు సినీయ‌ర్లు అభిప్రాయ‌ప‌డ్డారు.

యువరాజ్ సింగ్ త‌ర్వాత మిడిల్ ఆర్ఢ‌ర్ లో భార‌త్ కు ఆ స్థాయిలో ఆడే ఆట‌గాడు లేడు. దీంతో నాలుగో స్థానంలో ఎన్నో ప్ర‌యోగాలు చేసింది. ఈ నేప‌థ్యంలో వ‌న్డే ప్రపంచకప్ అనంతరం అయ్యర్ రూపంలో భారత జట్టుకు ఈ సమస్య తీరింది. ఇప్పటివరకూ శ్రేయ‌స్స్ అయ్యర్ టీమిండియా త‌ర‌పున‌ 18 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. ఇటీవ‌లే ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సిరీస్ ల్లో అయ్య‌ర్ అద్బుతంగా రాణించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories