Shoaib Akhtar: భారత్ విజయంపై అక్తర్ ప్రశంసలు.. బీసీసీఐని చూసి నేర్చుకోండంటూ పీసీబీపై ఫైర్!

Shoaib Akhtar
x

Shoaib Akhtar: భారత్ విజయంపై అక్తర్ ప్రశంసలు.. బీసీసీఐని చూసి నేర్చుకోండంటూ పీసీబీపై ఫైర్!

Highlights

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా టీమిండియా ప్రదర్శనను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని పొగిడాడు.

టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ కైవసం చేసుకున్న భారత జట్టుపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని దేశాల దిగ్గజాలు అందరూ టీమిండియా విజయంను ప్రశంసిస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా టీమిండియా ప్రదర్శనను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని పొగిడాడు. భారత జట్టు విజయానికి ప్రధాన కారణం మెరిట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయాలేనని అక్తర్ అభిప్రాయపడ్డారు.

ఒక ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. భారత జట్టు యువ ఆటగాళ్ల ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రశంసించాడు. 'టీ20 ప్రపంచ కప్ 2026లో సంజు శాంసన్ కేవలం 4-5 మ్యాచ్‌ల్లోనే అద్భుత ప్రదర్శన చేసి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడం గొప్ప విషయం. అవకాశం లేటుగా వచ్చినా రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. అవాకు అతడు 100 శాతం అర్హుడు. ఇషాన్ కిషన్ మరోసారి తన ప్రతిభను నిరూపించాడు. ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ కూడా జట్టు విజయానికి కీలకమైంది. అంతకుముందు తడబడిన అభిషేక్ ఫైనల్లో మాత్రం రెచ్చిపోయాడు. ఈ ముగ్గురు నాకౌట్ మ్యాచులలో అదరగొట్టారు' అని అక్తర్ అన్నాడు.

భారత క్రికెట్ వ్యవస్థపై కూడా షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. 'టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు విజయానికి అసలు కారణం ఆటగాళ్లను ఎంపిక చేసిన విధానం. మెరిట్‌కు ప్రాధాన్యం ఇచ్చే భారత వ్యవస్థే ఇప్పుడు గెలిచింది. జట్టు ఎంపికలో తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు ఈ విజయానికి మార్గం సుగమం చేశాయి. ప్రత్యేకంగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం, యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచడమే భారత జట్టు విజయానికి కారణం. జట్టు మేనేజ్‌మెంట్ ధైర్యంగా సీనియర్ ఆటగాళ్లలకు గుడ్‌బై చెప్పి యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చింది. బీసీసీఐ సరైన ప్రతిభను నిత్యం గుర్తిస్తోంది. యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచిన భారత మేనేజ్‌మెంట్ సక్సెస్ అయ్యింది. బీసీసీఐని చూసి పీసీబీ చాలా నేర్చుకోవాలి' అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories