అతడే టీమిండియాలో నైపుణ్యం కలిగిన ప్లేయర్

అతడే టీమిండియాలో నైపుణ్యం కలిగిన ప్లేయర్
x
Highlights

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20ల భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వన్డేలో భారత్ అద్భుతంగా ఆడి ఐదు టీ20 సిరీస్ కైవసం చేసుకుని కివీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20ల భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వన్డేలో భారత్ అద్భుతంగా ఆడి ఐదు టీ20 సిరీస్ కైవసం చేసుకుని కివీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే చివరి టీ20పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ పేసర్ రావల్సిండి ఎక్స్‌ప్రెస్ సోయబ్ అక్తర్ విశ్లేషించాడు. తన యూట్యూబ్ చానెల్ ద్వారా పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. మొదటి 10 ఓవర్లు మ్యాచ్‌ ఆతిథ్య కివీస్ చేతుల్లోనే ఉందని తెలిపాడు. అయితే భారత్‌ అనూహ్యంగా తిరిగి పుంజుకుందని తెలిపాడు. జస్‌ప్రీత్‌ బుమ్రానే భారత్ ఎక్స్ ఫ్యాక్టర్ అని ప్రశంసలతో ముంచెత్తాడు. భారత్ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రానే మ్యాచ్ స్వరూపాన్నే మార్చారని తెలిపాడు. టీమిండియా ఓటమి అంచున ఉండగా తిరిగి పుంజుకుని గెలిచిందంటే బౌలింగ్ క్రెడిట్ బుమ్రాకే దక్కుతుందని తెలిపారు. బుమ్రా నాణ్యమైన బౌలరో మరోసారి క్రికెట్ ప్రపంచానికి తెలిసిందని వెల్లడించాడు.

నవదీప్ సైనీ, శార్దూల్‌ ఠాకూర్ మెరుగైన బౌలింగ్‌ వేసినా, భారత్ క్రికెట్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌ మాత్రం బుమ్రానే అంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత మంచి ప్రదర్శన చేయడం చూస్తే అసాధారణమైన క్రికెటర్‌గా బుమ్రా నిలుస్తాడని కొనియాడారు. కొంతమంది బౌలర్లు గాయం నుంచి కోలుకున్న తర్వాత లయ అందుకోవడానికి సమయం తీసుకుంటారని , బుమ్రా తొందరగా అందిపుచ్చుకున్నాడన్నారు.

న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 12 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. డెత్‌ ఓవర్లలో బుమ్రా ఎప్పుడూ 25-30 పరుగులు ఇచ్చిన దాఖలాలు లేవని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన ఆఖరి టీ20లో టీమిండియా సమష్టి‌గా రాణించి 7 పరుగులతో విజయం సాధించింది. ఇరు జట్ట మధ్య వన్డే సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే హామిల్టన్ వేదికకానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories