Shashank Manohar: ఐసీసీలో ముగిసిన శశాంక్‌ మనోహర్‌ ఇన్నింగ్స్‌.. కొత్త చైర్మన్ రేసులో సౌరభ్‌ గంగూలీ?

Shashank Manohar: ఐసీసీలో ముగిసిన శశాంక్‌ మనోహర్‌ ఇన్నింగ్స్‌.. కొత్త చైర్మన్ రేసులో సౌరభ్‌ గంగూలీ?
x
Shashank Manohar (File Photo)
Highlights

Shashank Manohar అంతర్జతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో శశాంక్‌ మనోహర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

Shashank Manohar అంతర్జతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో శశాంక్‌ మనోహర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఈ బుధవారంతో ఐసీసీకి తొలి స్వతంత్ర ఛైర్మన్‌గా ఉన్న అతని పదవీకాలం ముగిసింది. నవంబరు2015లో ఐసీసీ బాధ్యతలు మనోహర్‌ అందుకున్నారు.రెండేళ్ల ఒకసారి చొప్పున రెండు పర్యాయాలు ఛైర్మన్‌గా పనిచేశాడు. నిబంధనల ప్రకారం మరో దఫా కూడా కొనసాగే వీలున్నాప్పటికి మనోహర్‌ తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. మనోహర్‌ నాలుగెల్లు ఛైర్మన్‌గా ఉన్న తన పదవి నుంచి స్వచ్చందంగా తప్పుకున్నాడు.

ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్‌ను ఎంపికైయ్యేవరకు వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వైస్‌ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా (హాంకాంగ్‌) బాధ్యతలు నిర్వర్తిస్తాడని ఐసీసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా.. జూలై నెల రెండో వారంలో జరిగే బోర్డు సమావేశంలో కొత్త ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియకు ఆమోదం తెలుపనున్నారు.

ఇక 2సార్లు బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసిన మనోహర్‌ ఐసీసీ ఛైర్మన్‌గా ఉన్న కాలంలో భారత బోర్డు ప్రాభవం తగ్గిందనే చెప్పాలి. మనోహర్‌తో బీసీసీఐకి పొసగలేదు. అతడికి, బోర్డుకు మధ్య చాలా విషయాల్లో విభేదాలు తలెత్తాయి. మనోహర్‌ నేతృత్వంలోని ఐసీసీ.. 'బిగ్‌ త్రీ' ఆదాయ పంపిణీ నమూనాను రద్దు చేయడంతో బీసీసీఐ ఆర్థికంగా నష్టపోయింది కూడా. భారత్‌లో నిర్వహించిన, నిర్వహించబోయే ప్రపంచకప్‌లకు పన్ను మినహాయింపు విషయంలోనూ ఐసీసీ.. బీసీసీఐకి వ్యతిరేకంగా వ్యవహరించడంలో మనోహర్‌ కీలకంగా ఉన్నాడు.

కొత్త చైర్మన్ రేసులో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ మాజీ ఛైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌ కొత్త ఛైర్మన్‌ రేసులో ముందు వరుసలో ఉన్నారు. తాత్కాలిక చైర్మన్ ఖవాజా కూడా పోటీలో ఉన్నాడు. పశ్చిమ్‌ బంగ, బీసీసీఐలలో కార్యవర్గ సభ్యుడిగా గంగూలీ పదవీ కాలం ఈనెల 31తో ఆరేళ్లు పూర్తవుతుంది. జస్టిస్‌ లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం ఆరేళ్ల తర్వాత మూడేళ్లు విరామం తీసుకోవాలి. విరామ కాలం నిబంధనలో సడలింపు కోరుతూ గంగూలీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఐసీసీ ఛైర్మన్‌ పదవికి గంగూలీ పోటీపడతాడా? లేదా? అన్నది అత్యున్నత స్థానం తీర్పుపై ఆధారపడి ఉంటుంది. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు సుప్రీం అనుమతిస్తే గంగూలీ ఐసీసీ వైపు చూడకపోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories