Mohammed Shami: ఐపీఎల్ లో షమీ బిజీ.. ఇక్కడ కుటుంబ సభ్యులు జైలుకు రెడీ!

Shamis Sister and Brother-in-Law Face Trouble in MNREGA Scam
x

Mohammed Shami: ఐపీఎల్ లో షమీ బిజీ.. ఇక్కడ కుటుంబ సభ్యులు జైలుకు రెడీ!

Highlights

Mohammed Shami: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడ్డారు.

Shami's Sister and Brother-in-Law Face Trouble in MNREGA Scam

Mohammed Shami: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడ్డారు. షమీ అక్క, బావతో పాటు మరికొందరు బంధువులు మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరంతా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA) నిధులను అక్రమంగా పొందిన కేసులో ఇరుక్కున్నారు.

జిల్లా మేజిస్ట్రేట్ (DM) నిధి గుప్తా వత్స్ బుధవారం ఈ విషయం వెల్లడించారు. ప్రాథమిక విచారణలో MNREGA నిధుల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు. బాధ్యులైన ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు, పంచాయతీ రాజ్ చట్టం కింద వారిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు.

షమీ అక్క, బావతో సహా 18 మందిపై కేసు

స్థానిక అధికారులు జరిపిన విచారణలో మొత్తం 18 మంది ఎలాంటి పని చేయకుండానే MNREGA భత్యం పొందుతున్నట్లు తేలింది. ఈ 18 మందిలో మహమ్మద్ షమీ పెద్ద అక్క షబీన, ఆమె భర్త గజనవి, షబీన ముగ్గురు బావలు (ఆమె భర్తల సోదరులు) అమీర్ సుహైల్, నసీరుద్దీన్, షేకు ఉన్నారు. అంతేకాకుండా, గ్రామ ప్రధాన్ గులే అయేషా కుమార్తె, కుమారుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయని డీఎం పేర్కొన్నారు.

మూడేళ్లుగా పని చేయకుండానే డబ్బులు

గ్రామ ప్రధాన్‌గా ఉన్న గులే అయేషా, మహమ్మద్ షమీ అక్కకు అత్తగారు కూడా. ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధారి ఆమెనే అని అధికారులు అనుమానిస్తున్నారు. విచారణలో తేలిన 18 మందికి జనవరి 2021లో MNREGA జాబ్ కార్డులు జారీ అయ్యాయి. వారు ఒక్క రోజు కూడా పని చేయకపోయినా, ఆగస్టు 2024-25 వరకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.

డీఎం గ్రామ ప్రధాన్ బ్యాంకు ఖాతాను సీజ్ చేయాలని, అక్రమంగా పొందిన డబ్బును తిరిగి వసూలు చేయాలని ఆదేశించారు. MNREGAలో అవకతవకలకు సంబంధించి పలు మీడియా కథనాలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. గ్రామ ప్రధాన్‌తో పాటు విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా విచారణ పరిధిలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories