బంగ్లా కెప్టెన్ షకీబుల్‌ పై ఐసీసీ వేటు.. స్పందించిన ప్రధాని షేక్‌ హసీనా

బంగ్లా కెప్టెన్ షకీబుల్‌ పై ఐసీసీ వేటు.. స్పందించిన ప్రధాని షేక్‌ హసీనా
x
Highlights

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబుల్‌ హసన్‌కు ఐసీసీ రెండేళ్ల పాటు నిషేదం విధించింది. బంగ్లదేశ్ ప్రధాని షేక్‌ హసీనా షకీబుల్‌ కు అండగా నిలిచారు.

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబుల్‌ హసన్‌కు ఐసీసీ రెండేళ్ల పాటు నిషేదం విధించింది. ఫిక్సింగ్‌ పాల్పడాలని కొందరు బుకీలు సంప్రదించిన నేపథ్యంలో అవినీతి నిరోధక అధికారులకు షకీబుల్‌ హసన్‌ సమాచారం ఇవ్వకపోవడంతో అతనిపై వేటు వేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బంగ్లదేశ్ ప్రధాని షేక్‌ హసీనా షకీబుల్‌ కు అండగా నిలిచారు. షకీబుల్ చేసిన చిన్న పొరపాటని ఆ విషయాన్ని అతడు కూడా అంగీకరించాడని తెలిపారు. ఇలాంటి సమయంలో బంగ్లా క్రికెట్ బోర్డు షకీబుల్ కు అండగా నిలవాలని సూచిస్తున్నానని హసీనా పేర్కొన్నారు

దీనిపై స్పందించిన బోర్డు షకీబుల్‌ హసన్‌ గొప్ప క్రికెటర్‌ అతడు సుదీర్ఘ కాలంగా ఎన్నో అపూర్వ విజయాలను జట్టుకు అందిచాడు. నిషేదం ముగిసిన అనంతరం జట్టులోకి వచ్చి దేశానికి సేవలు అందిస్తాడని ఆశిస్తున్నామని బీసీబీ తెలిపింది. 2018లో జరిగిన రెండు టోర్నీల్లో బంగ్లా కెప్టె న్‌ షకీబుల్‌ హసన్‌పై ఐసీసీ మూడు ఆరోపణలు చేసింది. ఏ మ్యాచ్‌ కోసం బూకీలు సంప్రదించారో ఆ మ్యాచ్ ముగిసేలోగా ఐసీసీలోని అవినీతి నిరోధక అధికారులకు తెలియజేయాలని, అయితే దీనిని కెప్టెన్ షకీబుల్‌ హసన్‌ వెల్లడించకపోవడం అతని పూర్తి తప్పిదంగా భావిస్తన్నామని ఐసీసీ అధికారి అలెక్స్‌ మార్షల్‌ చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories