
Shai Hope: సూపర్-8కు చేరిన ఆనందం ఉన్నా.. భారత్‌తో మ్యాచ్ అంటే భయమేస్తోంది!
టీ20 వరల్డ్‌కప్ 2026లో సూపర్-8 దశకు అర్హత సాధించడం చాలా ఆనందంగా ఉందని వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తెలిపాడు.
టీ20 వరల్డ్‌కప్ 2026లో సూపర్-8 దశకు అర్హత సాధించడం చాలా ఆనందంగా ఉందని వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తెలిపాడు. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకోవడం జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందనిన్నాడు. సూపర్-8లోకి వచ్చిన ప్రతి జట్టూ బలమైనదేనని, ఇక నుంచి ప్రతి మ్యాచ్ చాలా కఠినంగా ఉండబోతుందని పేర్కొన్నారు. అన్నింటికంటే భారత్‌తో మ్యాచ్ చాలా కష్టం అని, కాస్త భయంగానే ఉందని షాయ్ హోప్ చెప్పుకొచ్చాడు. కోల్‌కతా వేదికగా ఇటలీతో ఈరోజు జరిగిన లీగ్ మ్యాచ్‌లో విండీస్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ సూపర్-8 పోరుపై స్పందించాడు.
'ప్రతి గ్రూప్ మ్యాచ్ గెలిచి సూపర్-8 చేరుకోవడం నిజంగా గొప్పగా అనిపిస్తుంది. సూపర్ ఎయిట్‌లోని ప్రతి జట్టు చాలా కఠినమైనది. సూపర్-8 లో మ్యాచ్‌లు చాలా సవాలుగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్ నాకు చాలా కఠినమైనది. భారత్ పెద్ద జట్టు, ప్రపంచంలోనే నంబర్ వన్ టీమ్. కాస్త టెన్షన్ ఉన్నా.. టీమిండియాను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతం, మేము టీమిండియా గురించి మాత్రమే ఆలోచించడం లేదు. మేము ఒక్కో మ్యాచ్ గెలుస్తూ ముందుకు సాగాలనుకుంటున్నాము. సెమీ-ఫైనల్స్‌కు చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాము' అని వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ చెప్పాడు.
మొత్తంగా చూస్తే సూపర్-8 దశలో బలమైన జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా భారత్ వంటి పటిష్టమైన జట్టుతో మ్యాచ్‌పై షాయ్ హోప్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. సూపర్ -8లో భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో విండీస్ మ్యాచులు ఆడనుంది. ఫిబ్రవరి 23న జింబాబ్వేతో, ఫిబ్రవరి 26న దక్షిణాఫ్రికాతో, మార్చి 1న భారత్‌తో విండీస్ మ్యాచులు ఆడనుంది. మూడింటిలో రెండు గెలిస్తే సెమీ-ఫైనల్స్ చేరుతుంది. లీగ్ దశలో విజయాలు అందుకున్న విండీస్.. సూపర్-8 దశలో ఎలా ఆడుతుందో చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




