WPL 2025: డబ్ల్యూపీఎల్ లో చెలరేగిన షెఫాలీ వర్మ.. ఒకే ఓవర్లో 6,4,4,4,4... కానీ చివరకు

Shafali Verma Shines in Womens Premier League 2025 Blistering Start for Delhi Capitals Against Mumbai Indians
x

WPL 2025: డబ్ల్యూపీఎల్ లో చెలరేగిన షెఫాలీ వర్మ.. ఒకే ఓవర్లో 6,4,4,4,4... కానీ చివరకు  

Highlights

WPL 2025: షెఫాలీ వర్మ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో అద్భుతమైన ఆరంభం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్‌లో తను బ్యాటింగులో చెలరేగిపోయింది.

WPL 2025: షెఫాలీ వర్మ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో అద్భుతమైన ఆరంభం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్‌లో తను బ్యాటింగులో చెలరేగిపోయింది. తన జట్టు ఫిబ్రవరి 15 శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో తలపడింది. వడోదరలో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్‌లోనే స్ట్రైక్ కొట్టి బౌండరీల వర్షం కురిపించింది. మొదటి బంతిని డాట్‌గా ఆడిన తర్వాత, తను తరువాతి 5 బంతుల్లో 4 ఫోర్లు,1 సిక్స్ కొట్టి ఒక్క ఓవర్లోనే 22 పరుగులు చేసింది. ఆమె 18 బంతుల్లో 238 స్ట్రైక్ రేట్‌తో 43 పరుగులు చేసింది. అందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఆమె ముంబైపై దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఆమెను ఆపడం బౌలర్లకు దాదాపు అసాధ్యంగా మారిపోయింది. కానీ ఆ తర్వాత ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ మ్యాజిక్ చేసి ఆమె వికెట్ తీసింది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 164 పరుగులు చేసింది. తర్వాత షెఫాలీ వర్మ, మెగ్ లాన్నింగ్ ఢిల్లీ తరపున ఓపెనర్లుగా అడుగుపెట్టారు. మొదటి ఓవర్లో లానింగ్ మొత్తం 6 బంతులు ఆడారు. ఈ ఓవర్‌లో షెఫాలికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ ఆమె రెండో ఓవర్లో స్ట్రైక్‌లోకి వచ్చిన వెంటనే.. ఆమె సంచలనం సృష్టించింది. సైకా ఇషాక్‌ విసిరిన మొదటి బంతికి ఆమె ఒక్క పరుగు చేయలేకపోయింది. కానీ రెండో బంతికే సిక్స్ కొట్టింది. మూడో బంతిని బౌండరీ దాటించింది. తరువాతి 3 బంతులు కూడా ఫోర్లు కొట్టింది. ఈ విధంగా తను కేవలం ఆరు బంతుల్లో 22 పరుగులు చేసింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ టీం ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. షెఫాలీ వర్మ తన కెప్టెన్సీలో చాలా మ్యాచ్‌లు ఆడింది. అందువల్ల హర్మన్‌ప్రీత్‌కు తన బలాలు, బలహీనతలు రెండూ బాగా తెలుసు. ముంబై కెప్టెన్ తన అనుభవాన్ని ఉపయోగించి దూసుకుపోతున్న షెఫాలీని ఆపగలిగింది. పవర్‌ప్లే చివరి ఓవర్‌లో తను బంతిని హేలీ మాథ్యూస్‌కి అప్పగించింది. తను షెఫాలిని కట్టడి చేసింది. మాథ్యూస్ మొదటి 3 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. కానీ నాలుగో బంతికే షెఫాలీని పెవిలియన్‌కు పంపింది. షెఫాలి 7 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories