యువ సంచలనం షఫాలీ వర్మ అరుదైన ఘనత .. ఐసీసీ ప్రత్యేకమైన ట్వీట్‌!

యువ సంచలనం షఫాలీ వర్మ అరుదైన ఘనత .. ఐసీసీ ప్రత్యేకమైన ట్వీట్‌!
x
షఫాలీ వర్మ ఫైల్ ఫోటో
Highlights

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మహిళా జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మహిళా జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్‌ ఏలో మొదటి స్థానంలో నిలిచిన భారత్, గ్రూప్‌ బీలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌తో సెమీస్ లో తలపడనుంది. ఇక మరో సెమీస్‌లో ఆస్ట్రేలియాతో గ్రూప్ బీలో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఢీకొట్టనుంది.

టీమిండియా మహిళా క్రికెటర్, హిట్టర్ షఫాలీ వర్మ కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో 16ఏళ్ల షఫాలీ వర్మ అగ్ర స్థానాన్ని కైవసం చేసుంది. గత రెండు సంవత్సరాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న కివీస్ బ్యాట్స్ ఉమెన్ సుజీ బేట్స్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత షఫాలీ సొంతం చేసుకుంది. ఈ మెగా టోర్ని ఆరంభం నుంచి షఫాలీకి అదరగొడుతుంది. మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో సెమీస్ ముందే షఫాలీ నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు అందుకోవడం విశేషం.

షఫాలీ వర్మ గ్రూప్ ఏలోని నాలుగు మ్యాచ్‌ల్లో 161 పరుగులు చేసింది. దీంతో మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తర్వాత టీ20ల్లో నెంబర్ ర్యాంక్ సాధించి రెండో క్రికెటర్‌గా నిలిచారు. టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక స్టైక్‌రేట్‌ నమోదు చేసిన యువ మహిళా క్రీకెటర్ గా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో షఫాలీ వర్మ ఐసీసీ స్పెషల్ ఇంటర్వ్యూతో కూడిన వీడియోను షేర్‌ చేసింది. 30 ఏళ్లుగా తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ పేరిట ఉన్న రికార్డును షఫాలీ వర్మ బద్దలు కొట్టి వార్తల్లో నిలిచింది. సచిన్‌ స్ఫూర్తితో బ్యాట్‌ పట్టి అంతర్జాతీయ క్రికెట్లో అర్ధ సెంచరీ సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ఇక ఐసీసీ మహిళా టీ20 బౌలింగ్‌ విభాగంలో ర్యాంకింగ్స్‌ చూస్తే ఇంగ్లండ్‌ బౌలర్‌ సోఫీ ఎక్లేస్టోన్‌ అగ్ర స్థానంలో నిలిచారు. ఈ టోర్నమెంట్‌లో నాలుగు మ్యాచులు ఆడిన సోఫీ 8 వికెట్లు తీశారు. కాగా టీమిండియా మహిళా బౌలర్లు దీప్తీ శర్మ, రాధా యాదవ్ ర్యాంకులు కోల్పోయి 6, 7వ స్థానాల్లో నిలిచారు. ఇక భారత లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ 4 స్థానాలు ఎగబాకి 8వ స్థానానికి చేరుకున్నారు. ఈ గురువారం భారత్ ఇంగ్లాండ్ తో సెమీస్ లో అమితుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories