Shafali Verma: షెఫాలీ వర్మకు అరుదైన ఛాన్స్

Shafali Verma: షెఫాలీ వర్మకు అరుదైన ఛాన్స్
x
షఫాలీ వర్మ ఫైల్ ఫోటో
Highlights

టీమిండియా మహిళ జట్టు డాషింగ్ ఓపెనర్, హిట్టర్ షెఫాలీ వర్మ అరుదైన అవకాశం దక్కింది.

టీమిండియా మహిళ జట్టు డాషింగ్ ఓపెనర్, హిట్టర్ షెఫాలీ వర్మ అరుదైన అవకాశం దక్కింది. షెఫాలీ వర్మను శీతల పానీయాల సంస్థ 'పెప్సీ' బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ లోకి భారత్ చేరడంతో షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో మంచి ఆదరణ లభించింది. షెఫాలీ వర్మతో ఒక ఏడాది పాటు ఒప్పందం చేకుందని తెలుస్తోంది.

ప్రముఖ బ్రాండ్‌తో కంపెనీతో షఫాలికి ఇదే మొదటి ఒప్పందం కావడం విశేషం. పెప్సీతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని షెఫాలీ వర్మ పేర్కొంది. ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియడం లేదు. విభాగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారు. ఇది మా కాళ్లపై మేం నిలబడాల్సిన తరుణం అంటూ షెఫాలీ పేర్కొంది.

2019 సెప్టెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం 16 ఏళ్ల షెఫాలీ వర్మ.. అనతి కాలంలోనే కాలంలోనే ప్రపంచ నంబర్‌వన్‌గా బ్యాట్స్‌ఉమెన్‌గా మారిన తెలిసిందే. ఇటీవలే ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండేళ్లుగా మొదటి స్థానంలో కొనసాగుతున్న కివీస్ స్టార్ సుజీ బేట్స్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం దక్కించుకుంది. షెఫాలీ కేవలం 18 మ్యాచులు మాత్రమే ఆడి దక్కించుకోవడం గమనార్హం. భారత మహిళ దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ తర్వాత ఐసీసీ ర్యాంకుల్లో మొదటి స్థానం సాధించిన క్రికెటర్‌ షెఫాలీ వర్మనే కావడం విశేషం. ప్రపంచకప్ టోర్నీలో నాలుగు లీగు మ్యాచుల్లో కలిపి 161 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories