Sanju Samson: 6,6,6,4.. ఇంతకు సంజు శాంసన్‌ ఆడినట్టా?, ఆడనట్టా?

Sanju Samson: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ ఆడాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఢిల్లీ వేదికగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సంజు ఆడాడు.

Rishvik
Published on: 12 Feb 2026 9:30 PM IST
Sanju Samson
X

Sanju Samson: 6,6,6,4.. ఇంతకు సంజు శాంసన్‌ ఆడినట్టా?, ఆడనట్టా?

Sanju Samson: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ ఆడాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఢిల్లీ వేదికగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సంజు ఆడాడు. దాంతో టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడిన రెండో అత్యధిక వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. సంజు 31 ఏళ్ల 93 రోజులో మొదటి టీ20 ప్రపంచకప్‌ ఆడాడు. ఈ జాబితాలో వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అగ్ర స్థానంలో ఉన్నాడు. 31 ఏళ్ల 117 రోజులు వయసు ఉన్నప్పుడు మిశ్రా తన టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్ ఆడాడు. అయితే లేటు వయసులో టీ20 ప్రపంచకప్‌లో ఎంట్రీ ఇచ్చిన సంజు.. అభిమానులను నిరాశపరిచాడు.

నమీబియాపై సంజు శాంసన్‌ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లో 22 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. రూబెన్ ట్రంపెల్‌మాన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోని చివరి బంతికి సంజు సిక్స్ కొట్టాడు. బెన్ షికోంగో వేసిన రెండో ఓవర్‌లోని 3, 4, 5 బంతులకు వరుసగా సిక్స్, సిక్స్, ఫోర్ బాది.. టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక సంజు ఫామ్ అందుకున్నాడని అందరూ సంతోషించే లోపే.. ఆశలు ఆవిరి చేశాడు. రెండో ఓవర్‌లోని చివరి బంతికి లౌరెన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో అరుణ్ జైట్లీ మైదానం ఒక్కసారిగా మూగబోయింది. మరోవైపు సంజు నిరాశగా పెవిలియన్ చేరాడు.

సంజు శాంసన్‌ 8 బంతుల్లోనే 22 రన్స్ చేసినా ఫాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'రాకరాక వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు', 'వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు' అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'ఇంతకు సంజు ఆడినట్టా?, ఆడనట్టా?' అంటూ సెటైర్లు వేస్తున్నారు. 'ఇక సంజు శాంసన్‌ కెరీర్ క్లోజ్' అంటూ మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. మొత్తానికి సంజు పేరు ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

2024 టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో సంజు శాంసన్‌ ఉన్నాడు. అయితే అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. 2026 టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఛాన్స్ రాకున్నా.. అభిషేక్ శర్మ గాయంతో అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సంజు ఒడిసిపట్టుకోలేదనే చెప్పాలి. ఫిబ్రవరి 15న పాకిస్థాన్ మ్యాచుకు అభిషేక్ అందుబాటులో ఉండనున్నాడు. దాంతో సంజు జట్టు నుంచి తప్పుకోవాల్సిందే. ఇక మెగా టోర్నీలో మరలా ఆడే అవకాశం రాకపోవచ్చు. సంజుకు ఇదే చివరి టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story