Sanju Samson: ఐదుగురు ప్లేయర్స్ కోసం పక్కన పట్టేశారు.. నేడు టీమిండియాకు 'ఆపద్బాంధవుడు' అయ్యాడు!

Sanju Samson: ఐదుగురు ప్లేయర్స్ కోసం పక్కన పట్టేశారు.. నేడు టీమిండియాకు ఆపద్బాంధవుడు అయ్యాడు!
x

Sanju Samson: ఐదుగురు ప్లేయర్స్ కోసం పక్కన పట్టేశారు.. నేడు టీమిండియాకు 'ఆపద్బాంధవుడు' అయ్యాడు!

Highlights

ఎన్నో విమర్శల తర్వాత ఛాన్స్.. కీలక సమయంలో జట్టును నిలబెట్టిన సంజూ స్యామ్సన్ సూపర్ ఇన్నింగ్స్!

కేరళ సూపర్ స్టార్, టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కెరీర్‌ ప్రయాణం ఎప్పుడూ సవాళ్లతోనే సాగింది. ఎన్నో మ్యాచ్‌ల్లో మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ అతడిని జట్టులోంచి తప్పిస్తూ వచ్చారు బీసీసీఐ సెలెక్టర్లు. ఆ మధ్య ఒకసారి జితేష్ శర్మ కోసం, మరోసారి రిషభ్ పంత్ కోసం సంజును బలి చేశారు. ఇటీవలి కాలంలో అయితే శుభ్‌మన్ గిల్ కోసం జట్టు నుంచి తప్పించారు. టీ20 ప్రపంచకప్ 2026లో ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ ఇషాన్‌కు అవకాశాలు ఇవ్వడం వల్ల సంజుకు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై అభిమానులు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే అవకాశాలు రాకపోయినా సంజు శాంసన్ సహనం మాత్రం కోల్పోలేదు. తనపై ఉన్న నమ్మకంతో సరైన సమయం కోసం ఎదురుచూశాడు. చివరకు ఆ అవకాశం వచ్చింది. అభిషేక్ శర్మ వరుసగా డకౌట్స్ అవ్వడం, తిలక్ వర్మ స్లో స్ట్రైక్ రేట్, ఓపెనర్ల విఫలం.. ఇలా అన్ని కలిసొచ్చాయి. అభిషేక్ ఒత్తిడికి గురవుతుండడంతో.. ధాటిగా ఆడే సంజుకు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. సూపర్-8లో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 97 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ మైదానం సంజు కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ఇన్ని రోజులు తనను బెంచ్‌కు పరిమితం చేసిన కోచ్, సెలెక్టర్ల నిర్ణయాలకు సంజు శాంసన్ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. విమర్శలు, నిరాశలు, అవకాశాల కొరత.. ఈ అన్నింటినీ అధిగమించి సంజు ఆడిన మ్యాచ్‌ విన్నింగ్ ఇన్నింగ్స్ ఇప్పుడు అభిమానులకు గర్వకారణంగా మారింది. 'జస్టిస్ ఫర్ సంజు' అని కోరిన అభిమానులు ఇప్పుడు 'జస్టిస్ బై సంజు' అని గర్వంగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఆలస్యంగా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని తాను ఎంత విలువైన ఆటగాడో సంజు మరోసారి నిరూపించాడు. భవిష్యత్తులో కూడా సంజు ఇలాగే జట్టుకు కీలకంగా మారాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories