అవన్నీ వదంతులే.. ధోనీ రిటైర్మెంట్‌ పై స్పందించిన సాక్షి

అవన్నీ వదంతులే.. ధోనీ రిటైర్మెంట్‌ పై స్పందించిన సాక్షి
x
MS Dhoni, Sakshi (File Photo)
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2019లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ధోని.. ఆ తర్వాత ధోని ఇప్పటివరకు టీం ఇండియా జెర్సీ ధరించలేదు. వాస్తవానికి వన్డే ప్రపంచకప్‌తోనే అతను రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ.. ఆ టోర్నీ తర్వాత మౌనంగా ఉండిపోయిన ధోనీ.. రిటైర్మెంట్‌పై ఎన్ని వార్తలు వచ్చినా ఈ 10 నెలల్లో ఒక్కసారి కూడా స్పందించలేదు.

ఐపీఎల్‌లో అతడి ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఐపీఎల్ వాయిదా పదుతూ వస్తుంది. అతని భార్య సాక్షి మాత్రం అప్పుడప్పుడు ఆ రూమర్స్‌పై మండిపడుతోంది. అయితే బుధవారం ధోని రిటైర్మెంట్‌ తీసుకున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. #dhoniretire అనే హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అయింది.

ఈ వార్తలకు ధోని సతీమని సాక్షి స్పందిస్తూ.. అది కేవలం రూమర్స్ మాత్రమే అని ఖండించారు. లాక్ డౌన్ ప్రజల్ని పిచ్చి వాళ్లని చేసిందని ఘాటుగా స్పందిస్తూ.. 'అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్‌ ప్రజలను మతిస్థిమితం లేనివారిగా మార్చిందని నేను అర్థం చేసుకున్నాను'అంటూ ట్వీట్‌ చేశారు. అయితే.. నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్‌ని సాక్షి డిలీట్ చేసింది. కానీ.. అప్పటికే ఆమెపై పెద్ద ఎత్తున అభిమానులు విమర్శలు గుప్పించారు. గతంలో ధోని రిటైర్మెంట్‌పై సాక్షి కూల్‌గానే సమాధానమిచ్చారని, తరుచూ వస్తున్నా ఆలాంటి వార్తలకు పూర్తిగా కోల్పోయి భావోద్వేగంతో అలా ట్వీట్‌ చేశారని ధోని కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపారు.

మరోవైపు ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ నిరూపించుకోవడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ధోనీ ఆశించాడు. ఈ మేరకు మార్చి నెల తొలి వారంలో చెపాక్ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ కూడా చేశాడు. కనీ కరోనా వైరస్, దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ 13 నిరవధికంగా వాయిదాపడింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories