Saina Nehwal : బ్యాడ్మింటర్ స్టార్ షాకింగ్ ప్రకటన.. తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన సైనా నెహ్వాల్

Saina Nehwal
x

Saina Nehwal : బ్యాడ్మింటర్ స్టార్ షాకింగ్ ప్రకటన.. తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన సైనా నెహ్వాల్

Highlights

Saina Nehwal : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్‎తో విడిపోతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. జూలై 13, ఆదివారం నాడు సైనా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

Saina Nehwal : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్‎తో విడిపోతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. జూలై 13, ఆదివారం నాడు సైనా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. దాదాపు 7 సంవత్సరాల వివాహ జీవితానికి, రెండు దశాబ్దాల వారి బంధానికి ఈ జంట ముగింపు పలికింది. సైనా తన ప్రకటనలో ఇలా రాసింది: "కొన్నిసార్లు జీవితం మనల్ని వేర్వేరు దిశలలోకి తీసుకువెళ్తుంది. చాలా ఆలోచించి, పారుపల్లి కశ్యప్,నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము మా ఇద్దరి కోసం శాంతి, అభివృద్ధి, గాయాలను నయం చేసుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాం. మా జ్ఞాపకాలకు నేను కృతజ్ఞురాలిని ముందుకు సాగేటప్పుడు అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మా గోప్యతను అర్థం చేసుకుని, గౌరవించినందుకు ధన్యవాదాలు." అంటూ రాసుకొచ్చింది. కశ్యప్ మాత్రం ఈ ప్రకటనపై ఇంకా స్పందించలేదు.

సైనా, కశ్యప్ 1997లో ఒక క్యాంపులో కలుసుకున్నారు. 2002 నుంచి హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిసి ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు వారి బంధం మరింత బలపడింది. 2004లో వారి జూనియర్ కెరీర్ సమయంలోనే వారిద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. కాలక్రమేణా, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే వారి బంధం మరింత గట్టిపడింది.

సైనా ఒలింపిక్ కాంస్యం, రల్డ్ నంబర్ 1 ర్యాంకింగ్‌తో గ్లోబల్ ఐకాన్‌గా మారింది. కశ్యప్ కూడా 2010లో కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి భారత పురుష షట్లర్‌గా గుర్తింపు పొందాడు. 2014లో అతను కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి 32 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికాడు.

వారి వృత్తిపరమైన సంబంధం 2018లో కోచ్-శిష్యులుగా మారింది. కశ్యప్ కోచింగ్‌లోకి మారిన తర్వాత సైనాకు కోచ్‌గా వ్యవహరించాడు. అతని వ్యూహాత్మక నైపుణ్యం, సైనా పట్టుదల 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధును ఓడించి స్వర్ణం గెలవడానికి సహాయపడింది. గాయాల నుంచి కోలుకుంటూ, కోచ్‌గా కశ్యప్ సైనాకు మద్దతు ఇచ్చాడు. చివరికి ఈ జంట 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories