Sachin Tendulkar: కోలుకున్న మాస్టర్ బ్లాస్టర్; హాస్పిటల్ నుంచి ఇంటికి

X
సచిన్ టెండూల్కర్ (ఫొటో ట్విట్టర్)
Highlights
Sachin Tendulkar: క్రికెట్ లెజండరీ సచిన్ టెండూల్కర్ కోవిడ్-19 తో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే.
Venkata Chari8 April 2021 4:07 PM GMT
Sachin Tendulkar: క్రికెట్ లెజండరీ సచిన్ టెండూల్కర్ కోవిడ్-19 తో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల పాటు చికిత్స అనంతరం నేడు ఇంటికి చేరుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్విట్ చేశాడు. మార్చి 27 న కరోనా వైరస్ బారినపడ్డాడు సచిన్. ఏప్రిల్ 2న కొన్ని లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాడు.
— Sachin Tendulkar (@sachin_rt) April 8, 2021
'ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చా. నేను స్వీయ నిర్బంధంలోనే కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటా. నా కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు. వైద్యుల సేవలను మరోసారి గుర్తుచేస్తున్నా. ఏడాది నుంచి వైద్యులు, సిబ్బంది అలుపెరగకుండా మనకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాళ్లు ఎంతో గొప్పవారు' అని సచిన్ ట్వీట్ చేశారు.
Web TitleSachin Tendulkar Discharged From Hospital
Next Story