Sachin Tendulkar Deepfake: సచిన్‌‌పై ''డీప్ ఫేక్‌'' వీడియో.. అది నమ్మొద్దని ఫ్యాన్స్‌ను హెచ్చరించిన మాస్టర్‌ బ్లాస్టర్‌

Sachin Tendulkar becomes latest victim of deepfake video
x

Sachin Tendulkar Deepfake: సచిన్‌‌పై ''డీప్ ఫేక్‌'' వీడియో.. అది నమ్మొద్దని ఫ్యాన్స్‌ను హెచ్చరించిన మాస్టర్‌ బ్లాస్టర్‌

Highlights

Sachin Tendulkar Deepfake: టెక్నాలజీ దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన సచిన్‌

Sachin Tendulkar Deepfake: డీప్‌ఫేక్‌ వీడియోలతో ఆందోళన చెందుతున్న ప్రముఖులు రోజురోజుకూ పెరుగుతున్నారు. సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ ఇప్పటికే పలు రకాల వీడియోలు బయటకు రావడం తీవ్ర కలకలం రేపగా.. తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌‌ వీడియో కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ గేమింగ్‌ యాప్‌నకు ఆయన ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది. దీన్ని సచిన్‌ ఖండించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్‌ మీడియాలో స్పష్టతనిచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు సచిన్‌.

స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌ పేరుతో ఉన్న గేమింగ్‌ యాప్‌నకు సచిన్‌ ప్రచారం చేస్తున్నట్లుగా డీప్ ఫేక్ వీడియో రూపొందించారు. ఈ యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫింగ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో సచిన్‌ దృష్టికి రావడంతో ఆయన దీనిపై స్పందించారు. సోషల్‌ మీడియా మాధ్యమాలు అప్రమత్తంగా ఉంటూ.. ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందించాలని కోరారు. నకిలీ సమాచారం, డీప్‌ఫేక్‌ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని ట్వీట్‌లో పేర్కొన్న సచిన్.. కేంద్ర ఐటీశాఖ మంత్రి ఖాతా, మహారాష్ట్ర సైబర్‌ వింగ్‌ అకౌంట్‌ను ట్యాగ్‌ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories