చచ్చీచెడి గెలిచిన బెంగళూరు

చచ్చీచెడి గెలిచిన బెంగళూరు
x
Highlights

బెంగళూరు భారీస్కోరైతే చేసింది... కానీ చావుతప్పి కన్నులొట్టపోయి గెలిచింది. కోల్‌కతా హిట్టర్లు రసెల్, రాణా సూపర్ ఇన్నింగ్స్ ఆడినా.. ఈ మ్యాచ్‌ ఆఖరి మూడు...

బెంగళూరు భారీస్కోరైతే చేసింది... కానీ చావుతప్పి కన్నులొట్టపోయి గెలిచింది. కోల్‌కతా హిట్టర్లు రసెల్, రాణా సూపర్ ఇన్నింగ్స్ ఆడినా.. ఈ మ్యాచ్‌ ఆఖరి మూడు బంతుల్లో బెంగళూరుకు గెలుపు మలుపు తిరిగి. చివరకు రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కోహ్లి (58 బంతుల్లో 100; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక్కొట్టగా, మొయిన్‌ అలీ (28 బంతుల్లో 66; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మోత మోగించాడు. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు మాత్రమే చేసిన విజయానికి అడుగు దూరంలో ఆగిపోయింది.

భారీ లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను స్టెయిన్‌ చావు దెబ్బ తీశాడు. అతను వేసిన తొలి ఓవర్లోనే లిన్‌ (1)ను పెవిలియన్ కు పంపించాడు. ఆ తరువాత మూడో ఓవర్లో శుబ్‌మన్‌ గిల్‌ (9)ను ఔట్‌ చేశాడు. నరైన్‌ (18) సైనీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో 33 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన జట్టును నితీశ్‌ రాణా ఆదుకున్నాడు. తొలి 10 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులే చేసింది. ఉతప్ప (9) కూడా విఫలమవగా... రాణాకు రసెల్‌ జతయ్యాడు. దీంతో రాణా సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలో 14 ఓవర్లు ముగిసేదాకా 101/4 స్కోరుతో ఉన్న కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్‌ నుంచి రసెల్‌ గర్జన మొదలైంది. చహల్‌ వేసిన ఆ ఓవర్లో రసెల్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదాడు. 16వ ఓవర్‌ వేసేందుకు వచ్చి సైనీకి రాణా ఇదే ఇనుభవం ఎదురైంది. ఈ దశలో జట్టు స్కోరు 153/4కు చేరింది. ఇక మూడు ఓవర్లు మిగిలాయి. కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 61 పరుగులు కావాలి. స్టెయిన్‌ బౌలింగ్‌లో రాణా చెలరేగాడు. 2 సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదడంతో 18 పరుగులు వచ్చేశాయి. ఇక ఆఖరి ఓవర్‌కు 24 పరుగులు చేయాల్సి వుండగా... కోహ్లి బంతి మొయిన్‌ అలీకిచ్చాడు. 4 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో సిక్సర్‌ కొట్టిన రసెల్‌ ఒక బంతి బీట్‌ అయ్యాడు. ఐదో బంతికి రనౌటయ్యాడు. రాణా సిక్సర్‌తో ఆట ముగించగా... బెంగళూరు విజయం సాధించింది. దీంతో కోహ్లీ సేన ఊపిరి పీల్చుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories