Rohit Sharma Security Breach: ‘సాయం చేయండి ప్లీజ్’.. రోహిత్‌ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ

Rohit Sharma Security Breach: ‘సాయం చేయండి ప్లీజ్’.. రోహిత్‌ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ
x

Rohit Sharma Security Breach: ‘సాయం చేయండి ప్లీజ్’.. రోహిత్‌ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ

Highlights

Rohit Sharma Security Breach: ఇందౌర్‌లో రోహిత్‌ శర్మ వద్దకు ఓ మహిళ దూసుకువచ్చిన ఘటన వైరల్‌. కుమార్తె అనారోగ్యంతో సాయం కోరినట్లు వివరణ. భద్రతపై చర్చ.

Rohit Sharma Security Breach: టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ భద్రతకు సంబంధించిన అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇందౌర్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ హోటల్‌కు వెళ్తుండగా ఓ మహిళ అకస్మాత్తుగా అతడి వద్దకు దూసుకువచ్చింది. తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతోందని, సాయం చేయాలని వేడుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే, ఈ ఘటనపై స్పందించిన ఆ మహిళ సరితా శర్మ తన ప్రవర్తనకు క్షమాపణలు తెలిపారు. సెల్ఫీల కోసం తాను అలా చేయలేదని, తన కుమార్తె ప్రాణాలు కాపాడుకునేందుకే భావోద్వేగంలో అలా జరిగిందని వీడియో ద్వారా వివరించారు. తన కుమార్తె అనికకు ప్రాణాపాయ స్థితి ఉందని, చికిత్స కోసం అమెరికా నుంచి తెప్పించాల్సిన రూ.9 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ అవసరమని వెల్లడించారు. ఇప్పటివరకు విరాళాల ద్వారా రూ.4.1 కోట్లు మాత్రమే సమీకరించగలిగామని చెప్పారు.

టీమ్‌ఇండియా–న్యూజిలాండ్‌ మ్యాచ్‌ సందర్భంగా క్రికెటర్లను కలవాలనే ఉద్దేశంతోనే హోటల్‌ వద్దకు వెళ్లానని, భావోద్వేగంతో రోహిత్‌ శర్మ చేతిని పట్టుకున్నానని ఆమె తెలిపారు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలను ఉద్దేశించి తన కుమార్తె కోసం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులు, భద్రతా సిబ్బంది విచారణ చేపట్టినట్లు సమాచారం.



Show Full Article
Print Article
Next Story
More Stories