సిరీస్‌ గెలుపుపైనే గురి

సిరీస్‌ గెలుపుపైనే గురి
x
Highlights

టీమిండియా, విండీస్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా చివరి టీ20 ముంబాయిలోని వాంఖడే వేదికగా జరగనుంది.

టీమిండియా, విండీస్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా చివరి టీ20 ముంబాయిలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లు చెరో విజయంతో సామానంగా నిలిచాయి. ఇక మూడో టీ20లో ఎవరు గెలిస్తే వారికే సిరీస్ దక్కుతుంది. బుధవారం జరగనున్న ఈ మ్యాచ్‌ లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు రెండు జట్లు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

అందులో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు. మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నామని, తమ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని వెల్లడించారు. దీంతో 2020లో జరగబోయే టీ20 ప్రపంచ కప్ గురించి తాము ఆలోచించడం లేదని వ్యా‌ఖ్యానించారు. ప్రస్తుతం తమ దృష్టి వెస్టిండీస్ లో జరగబోయే సిరీస్ పై మాత్రమే ఉందని తెలిపారు. ప్రపంచ కప్ కంటే ముందు జట్టును సిద్ధం చేస్తున్నామని చెప్పడం సరైంది కాదన్నారు. సిరీస్ గెలుపుపైనే ఫోకస్ ఉందని స్పష్టం చేశారు. మ్యాచ్ లో విజయాలు సాధించి, ఆటలో పరిణితి సాధిస్తే ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. సిమన్స్‌ చెలరేగడంతో విండీస్ అలవోకగా విజయం సాదించింది. 18.3 మూడు ఓవర్లలో 173 పరుగులు చేసి లక్ష్యాన్నిచేధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు జరిగిన తొలి టీ20లో ఉప్పల్ టీమిండియా భారీ విజయం నమోదు చేసుకుంది. దీంతో ఇరు జట్లు 1-1లో సమానంగా ఉన్నాయి. ఆఖరి టీ20లో విజయం సాధించిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories