
టీమిండియా భారీ షాక్ తగిలింది. టీమిండియా హిట్ మ్యాన్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే సిరీస్ నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తుంది.
టీమిండియా భారీ షాక్ తగిలింది. టీమిండియా హిట్ మ్యాన్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే సిరీస్ నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తుంది. ఐదో టీ20లో రోహిత్ 41 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్సులతో 60 పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచాడు. ధాటిగా ఆడుతున్న క్రమంలో రోహిత్ కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి రాలేదు. మూడు వన్డేల సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్ కూడా దూరం అవుతారని సమాచారం. రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తు్న్నాయి. రోహిత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా అభిమానలు కోరుకుంటున్నారు. ఇప్పటికే టీ20 సిరీస్ ముందు గాయం కారణంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తప్పుకున్న సంగతి తెలిసిందే.
కివీస్ ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఐదు టీ20ల సిరీస్ ముగిసింది. ఐదు టీ20ల్లో క్లీన్ స్వీప్ చేసి బ్లాక్‌క్యాప్స్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. అయితే ఇరు జట్ల మధ్య 50 ఓవర్ల ఫ్లార్మాట్ ప్రారంభంకానుంది. ఇప్పటికే మూడు వన్డేలకు జట్టును, అటు బీసీసీఐ, ఇటు కివీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నె 5న హామిల్టన్ వేదికగా తొలి వన్డే మొదలవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే, ఫిబ్రవరి 11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే జరగనుంది.
అనంతరం టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 14 నుంచి 16 వరకూ హామిల్టన్ వేదికగా 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 21 నుంచి 25 వరకూ వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఇక ఫిబ్రవరి 29 నుంచి మార్చి 4 వరకూ క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు జరుగుతుంది. దీనితో కివీస్ టూర్ ని కంప్లీట్ చేసుకొని జట్టు భారత్ కి చేరుకుంటుంది.భారత కాలమాన ప్రకారం వన్డే మ్యాచ్‌లు ఉదయం 7.30 గంటలు మొదలుకానున్నాయి. ఇక టెస్ట్ మ్యాచ్‌లు ఉదయం 4 గంటలకి మొదలవుతాయి.
This is how cricket fans reacted after #RohitSharma ruled out of ODI, Test series against New Zealand#INDvsNZ #NZvsIND https://t.co/6s5Nknklbh
— DNA (@dna) February 3, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




