Rohit Sharma: రోహిత్‌ పని ఖతమేనా? ఎందుకిలా జరుగుతోంది?

Rohit Sharma
x

Rohit Sharma: రోహిత్‌ పని ఖతమేనా? ఎందుకిలా జరుగుతోంది?

Highlights

Rohit Sharma: రోహిత్ భావోద్వేగంగా మాట్లాడాడా? లేక సాధారణ సంభాషణేనా? అనే స్పష్టత లేదుగానీ, ఆ వీడియోతో సోషల్ మీడియాలో రోహిత్ పేరు మాత్రం విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.

Rohit Sharma: ఇటీవల రోహిత్ శర్మ చుట్టూ ఊహించని పరిణామాలు జరుగుతుండడం విశేషం. ఎన్నో విజయాలు ఇచ్చిన రోహిత్.. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ఒక చీకటి గదిలో పడ్డట్టుగా కనిపిస్తున్నాడు. ఆటతీరు నిలకడగా లేకపోతే ఎంతటి దిగ్గజం అయినా విమర్శల నుంచి తప్పించుకోలేడని మరోసారి సాక్ష్యం అవుతోంది. ధోనీ తర్వాత టీమిండియాకు ఐసీసీ టోర్నీల్లో మెరుగైన నాయకత్వం ఇచ్చిన రోహిత్ ఇప్పుడు సెలెక్షన్ ప్యానెల్‌కు అంత ప్రాధాన్యత లేని స్థితికి వచ్చేశాడు. రానున్న ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే జట్టులో కూడా అతను ఉంటాడో లేదో స్పష్టత లేదు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు అతడి ప్రదర్శన నిరాశజనకంగా ఉండటంతో విమర్శలు ముదిరిపోయాయి. చివరకు ఓ మ్యాచ్‌లో రోహిత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడిన నిర్ణయం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.

అయితే ఈ పరిస్థితుల్లో లక్నోలో రోహిత్ తన మాజీ ముంబై బౌలింగ్‌ కోచ్ జహీర్ ఖాన్‌ను కలిశాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో రోహిత్ తన మనసులో మాట చెప్పాడని కనిపిస్తోంది. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అందులో రోహిత్ ముంబైకి తన వంతు సేవ చేశానని పేర్కొన్న మాటలు ఆయన మనస్థాపాన్ని ప్రతిబింబిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ వీడియోపై అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది రోహిత్‌కు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు ముంబై ఫ్రాంచైజీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ముంబై మేనేజ్‌మెంట్ నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్లే రోహిత్ పూర్తిస్థాయిలో ఆడడం లేదు అన్నదే వారి అభిప్రాయం.

ఇక గత ఏడాది రోహిత్‌ను ముంబై కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాను నాయకుడిగా నియమించడం మరింత వివాదాస్పదంగా మారింది. అప్పటి నుంచి ముంబై ఫ్యాన్స్‌లో అంతర్మధనం మొదలైంది. మొదట హార్దిక్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నా, ఇప్పుడిప్పుడే ఆ వాతావరణం కొంత సర్దుబాటు అవుతోంది. కానీ రోహిత్ పరిస్థితి మాత్రం దయనీయంగా మారిపోతోంది. వన్డేల్లో మంచి ప్రదర్శన ఇస్తున్నా, ఐపీఎల్‌లో మాత్రం ఫామ్ అందుకోలేకపోతున్నాడు. అదే సమయంలో జహీర్‌తో జరిగిన సంభాషణలోని కొన్ని మాటలు మాత్రమే బయటకు రావడంతో, వివిధ రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. రోహిత్ భావోద్వేగంగా మాట్లాడాడా? లేక సాధారణ సంభాషణేనా? అనే స్పష్టత లేదుగానీ, ఆ వీడియోతో సోషల్ మీడియాలో రోహిత్ పేరు మాత్రం విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories