తండ్రి అయిన రోహిత్ శ‌ర్మ‌!

Rohit Sharma
x
Rohit Sharma
Highlights

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ తండ్రి అయ్యాడు. ఆయ‌న భార్య రితిక ఆదివారం ముంబైలోని ఓ హాస్పిట‌ల్‌లో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు.

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ తండ్రి అయ్యాడు. ఆయ‌న భార్య రితిక ఆదివారం ముంబైలోని ఓ హాస్పిట‌ల్‌లో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ గుడ్ న్యూస్ తెలిసిన వెంటనే రోహిత్ ఆస్ట్రేలియా నుంచి ముంబై బయలుదేరాడు. దీంతో అతడు నాలుగో టెస్ట్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. రోహిత్ జంటకు పాప పుట్టిన విషయాన్ని రితికా కజిన్ సీమా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పింది. రితికాతో తాను కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ పాప పుట్టిన విషయాన్ని తెలిపింది. మూడేళ్ల కిందట రోహిత్, రితికా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిన రోహిత్‌కు శుభాకాంక్షలు అంటూ బీసీసీఐ కూడా ట్వీట్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories