ఫెదరర్‌ రూ. 803 కోట్లు .. కోహ్లి రూ. 196 కోట్లు

ఫెదరర్‌ రూ. 803 కోట్లు .. కోహ్లి రూ. 196 కోట్లు
x
Virat Kohli, Roger federer (File photo)
Highlights

ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ తొలిసారి టాప్‌ ర్యాంక్‌లో చేరాడు.

ఏడాది కాలంలో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ తొలిసారి టాప్‌ ర్యాంక్‌లో చేరాడు. ఫోర్బ్స్‌ శుక్రవారం వెల్లడించిన ఈ జాబితాలో టాప్‌–100 క్రీడాకారుల జాబితాలో ఫెదరర్‌ 5వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎగబాకాడు. 2019 జూన్‌ నుంచి 2020 జూన్‌ కాలానికి ఫెదరర్‌ మొత్తం 10 కోట్ల 63 లక్షల డాలర్లు ( 803 కోట్ల రూపాయలు)సంపాదించాడు. ఇందులో 10 కోట్ల డాలర్లు ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చాయి. మిగతా 63 లక్షల డాలర్లు టోర్నీల ద్వారా గెల్చుకున్న ప్రైజ్‌మనీ.

ఈ జాబితాలో రూ. 196 కోట్ల ఆదాయంతో కోహ్లి 66వ స్థానంలో నిలిచాడు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఏకంగా 34 స్థానాలు ఎగబాకాడు. టాప్‌–100లో నిలిచిన ఏకైక క్రికెటర్, భారత్‌ నుంచి ఏకైక క్రీడాకారుడు కోహ్లినే కావడం విశేషం.

2019 'టాప్‌'లో ఉన్న పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో 10 కోట్ల 50 లక్షల డాలర్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ (10 కోట్ల 40 లక్షల డాలర్లు) 3వ ప్లేస్ లో నిలిచాడు. గతేడాది 100వ ర్యాంక్‌లో నిలిచిన కోహ్లి ఈసారి 2 కోట్ల 60 లక్షల డాలర్ల (రూ. 196 కోట్లు) ఆర్జనతో 66వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కోహ్లికి ఎండార్స్‌మెంట్ల ద్వారా 2 కోట్ల 40 లక్షల డాలర్లు లభించగా... 20 లక్షల డాలర్లు ప్రైజ్‌మనీ, వేతనం ద్వారా వచ్చాయు. 100 మంది జాబితాలో 35 మంది బాస్కెట్‌బాల్‌ ఆటగాళ్లు ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories