IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారిన రిషబ్ పంత్.. లక్నోతో తొలి మ్యాచ్‌లోనే డకౌట్!

Rishabh Pants IPL Debut Most Expensive Players Duck
x

IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారిన రిషబ్ పంత్.. లక్నోతో తొలి మ్యాచ్‌లోనే డకౌట్!

Highlights

IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారిన స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, లక్నో సూపర్ జెయింట్స్‌కు తన తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు.

IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారిన స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, లక్నో సూపర్ జెయింట్స్‌కు తన తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 27 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని అందుకున్న రిషబ్ పంత్, కొత్త సీజన్‌లోని తన మొదటి మ్యాచ్‌లోనే డకౌట్ అయ్యాడు. తన మాజీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా పంత్ ఖాతా తెరవకుండానే ఫెవిలియన్ బాట పట్టాడు. అయితే, దీనితో గౌతమ్ గంభీర్ రికార్డు మాత్రం చెక్కుచెదరకుండా ఉంది.

విశాఖపట్నంలో సోమవారం 24 మార్చి నాడు జరిగిన ఐపీఎల్ 2025 నాల్గవ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. గత సీజన్ వరకు పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, మెగా వేలానికి ముందు ఈ ఫ్రాంచైజీతో తన 9 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించాడు. ఆ తర్వాత మెగా వేలంలో లక్నో అతనికి 27 కోట్ల రూపాయల అత్యధిక బిడ్‌ను వేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

తొలిసారి డకౌట్ అయిన పంత్

ఖరీదైన ఆటగాడు కావడంతో ఈ సీజన్ అంతటా రిషబ్ పంత్ ప్రదర్శనపై అందరి దృష్టి ఉండటం సహజం. కానీ తన తొలి మ్యాచ్ లో అందరినీ నిరాశపరిచాడు. సీజన్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీపై పంత్ ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. మిచెల్ మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాత 12వ ఓవర్‌లో వచ్చిన పంత్, 14వ ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో పంత్ 6 బంతులు ఎదుర్కొన్నాడు.. కానీ ఖాతా తెరవలేకపోయాడు. అతని పాత సహచరుడు కుల్దీప్ యాదవ్ స్పిన్ వలకు వికెట్ సమర్పించుకున్నాడు. 14వ ఓవర్‌లో కుల్దీప్ వరుసగా 3 బంతుల్లో పంత్‌ను పరుగులు చేయనివ్వలేదు. దీంతో నాల్గవ బంతికి భారీ షాట్ ఆడబోయి బౌండరీ దాటించలేకపోయాడు.

చెక్కుచెదరని గంభీర్ రికార్డు

2016 నుంచి ఐపీఎల్ ఆడుతున్న పంత్ ఇంతకుముందు ఎప్పుడూ డకౌట్ కాలేదు. ఈ సమయంలో అతను ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగమయ్యాడు. అయితే ఢిల్లీని విడిచిపెట్టిన తర్వాత తన మొదటి మ్యాచ్‌లోనే ఈ పరిస్థితి ఎదురైంది. 6 బంతులు ఆడిన తర్వాత కూడా పంత్ ఖాతా తెరవలేకపోయాడు. అయినప్పటికీ గౌతమ్ గంభీర్ రికార్డు మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. ఐపీఎల్‌లో ఒక కెప్టెన్‌గా అత్యధిక బంతులు ఆడి డకౌట్ అయిన రికార్డు గంభీర్ పేరు మీదే ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న గంభీర్ 2014 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 బంతులు ఆడి కూడా ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories