Rishabh Pant: ఒక్క రన్ కు రూ. 24.5 లక్షలు..పరుగులు తక్కువ.. జరిమానా ఎక్కువ.. పంత్ విచిత్ర పరిస్థితి

Rishabh Pant
x

Rishabh Pant: ఒక్క రన్ కు రూ. 24.5 లక్షలు..పరుగులు తక్కువ.. జరిమానా ఎక్కువ.. పంత్ విచిత్ర పరిస్థితి

Highlights

Rishabh Pant: ఐపీఎల్ 2025లో ఒకవైపు రిషబ్ పంత్ ఒక్కో పరుగు చేసినందుకు రూ. 24.50 లక్షలు సంపాదిస్తుంటే.. మరోవైపు అతడు ఏకంగా రూ.24లక్షలు పోగొట్టకున్నాడు.

Rishabh Pant: ఐపీఎల్ 2025లో ఒకవైపు రిషబ్ పంత్ ఒక్కో పరుగు చేసినందుకు రూ. 24.50 లక్షలు సంపాదిస్తుంటే.. మరోవైపు అతడు ఏకంగా రూ.24లక్షలు పోగొట్టకున్నాడు. ఏప్రిల్ 27న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత అతనిపై జరిమానా విధించడంతో పంత్ ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఇంతకీ ఒక్కో పరుగుకు అంత సంపాదించే పంత్‌కు అంత పెద్ద జరిమానా ఎందుకు పడిందో తెలుసా ?. అతను లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉండి స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ జరిమానాను ఎదుర్కొన్నాడు. వాంఖడే స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అతను తన జట్టు ఓవర్ రేట్‌ను సమయానికి పూర్తి చేయడంలో విఫలమయ్యాడు.

నిజానికి స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు కెప్టెన్‌పై విధించే జరిమానా సాధారణంగా 12 లక్షల రూపాయలు ఉంటుంది. అయితే, ఈ సీజన్‌లో పంత్, అతని జట్టు చేసిన రెండవ తప్పు ఇది. అంటే వారు తమ తప్పును మళ్లీ పునరావృతం చేశారు. అందుకే అతనిపై ఏకంగా 24 లక్షల రూపాయల జరిమానా విధించారు. పంత్‌పై 24 లక్షల జరిమానాతో పాటు, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో LSG ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న ఆటగాళ్లందరూ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం - 6 లక్షల రూపాయలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం - ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది చెల్లించాల్సి ఉంటుంది.

రిషబ్ పంత్, అతని జట్టు LSG ఇంతకు ముందు ఏప్రిల్ 4న జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాను ఎదుర్కొన్నారు. యాదృచ్ఛికంగా ఆ మ్యాచ్ కూడా ముంబై ఇండియన్స్‌తోనే జరిగింది. అది లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్‌లో పంత్ కెప్టెన్‌గా మొదటిసారి ఓవర్ రేట్‌ను సమయానికి పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. దాని కారణంగా అతను 12 లక్షల రూపాయల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

రిషబ్ పంత్ ఐపీఎల్ 2025లోనే కాదు, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు. LSG అతన్ని ఏకంగా 27 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. కానీ, LSG యజమాని సంజీవ్ గోయెంకా అతనిపై పెట్టినంత డబ్బుకు తగిన ప్రదర్శన పంత్ నుండి రాలేదు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో పంత్ కేవలం 12.22 సగటు, 100 కంటే తక్కువ స్ట్రైక్ రేట్‌తో కేవలం 110 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంటే అతను చేసిన ఒక్కో పరుగు LSG యజమానికి 24.5 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories