IPL 2025 Final: మైదానంలో ఎమోషనల్..విరాట్ ను ఓదార్చిన అనుష్క..వీడియో వైరల్.!!

rcb wins ipl 2025 virat kohli emotional anushka sharma stunned telugu news
x

IPL 2025 Final: మైదానంలో ఎమోషనల్..విరాట్ ను ఓదార్చిన అనుష్క..వీడియో వైరల్.!!

Highlights

IPL 2025 Final: 18సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. తమ జట్టుపై ఇన్నేళ్లు అభమానులు పెట్టుకున్న...

IPL 2025 Final: 18సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. తమ జట్టుపై ఇన్నేళ్లు అభమానులు పెట్టుకున్న ఆశలను బెంగళూరు నెరవేరర్చింది. ఇక ఆర్సీబీ ప్రయాణంలో తొలి నుంచి ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీ సంతోషానికి అవధులు లేకుండాపోయింది. ఫైనల్ చివరి ఓవర్ లో జట్టు విజయానికి చేరవవుతున్న సమయంలో మైదానంలోనే విరాట్ భావోద్వేగానికి లోనయ్యాడు.

చివరి బంతికి పంజాబ్ పై విజయం సాధించగానే..కోహ్లీ భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక మైదానంలోన కుప్పకూలాడు. ఆ తర్వాత తన సహచర ఆటగాళ్లతో కలిసి సంబురాల్లో మునిగితేలాడు. అనంతరం ఈ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చిన అతని భార్య అనుష్క శర్మను ఆలింగనం చేసుకున్నాడు. ఈ సమయంలో అతని కన్నీళ్లను తుడిచి ఆమెను ఓదార్చుతూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ తర్వాత కోహ్లీ..ఆర్సీబీ మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డిలివియర్స్ వంటి ఆటగాళ్లతో కలిసి సంబురాలు చేసుకున్నాడు. ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవడం నమ్మశక్యం కాని భావన అంటూ ఈ రోజు వస్తుందని అనుకోలేదని కోహ్లీ అన్నాడు. చివరి బంతి పడ్డాక తాను భావోద్వేగాన్ని నియంత్రించేలేకపోయాని..ఇది గొప్ప అనుభూతి అని పేర్కొన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories