RCB vs RR: కోహ్లీ టీమ్‌తో ఫైట్‌కు ముందు ద్రవిడ్‌ గ్యాంగ్‌కు భారీ ఎదురుదెబ్బ..!

RCB vs RR
x

RCB vs RR: కోహ్లీ టీమ్‌తో ఫైట్‌కు ముందు ద్రవిడ్‌ గ్యాంగ్‌కు భారీ ఎదురుదెబ్బ..!

Highlights

RCB vs RR: రాజస్తాన్ రాయల్స్ ఏప్రిల్ 24న బెంగళూరులో ఆర్సీబీతో తలపడనుంది. ఆ మ్యాచ్‌కు సంజు అందుబాటులో ఉండడట!

RCB vs RR: రాజస్తాన్ రాయల్స్ కు పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. జట్టుకి కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్ బెంగళూరులో జరగబోయే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజును ఎడమ రిబ్ భాగంలో బంతి బలంగా తాకింది. దాంతో ఆటను మధ్యలోనే వదిలేసి అతను రిటైర్డ్ హర్ట్‌గా మైదానం విడిచిపోయాడు.

ఆ తర్వాత అతనికి కొంతకాలంగా కడుపులో నొప్పి కలుగుతోంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన హోం మ్యాచ్‌ను అతను ఆడలేదు. తాజా అప్డేట్ ప్రకారం, రికవరీలో ఉన్న సంజు రాయల్స్ జట్టుతో కలిసి బెంగళూరు ప్రయాణించట్లేదు. అతను జైపూర్‌లోనే కొన్ని ఫిజియో థెరపీలతో కోలుకుంటూ ఉన్నాడు. ఫిట్నెస్ పూర్తి స్థాయిలో రాబట్టిన తర్వాతే మళ్లీ జట్టుతో కలవనున్నాడు.

సంజు దూరమవడంతో రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశికి అవకాశం వచ్చింది. మొదటిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ యువ ఆటగాడు కేవలం 20 బంతుల్లోనే 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ప్రత్యేకంగా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో 80 మీటర్ల భారీ సిక్సర్ కొట్టి మైదానంలో తన పవర్‌ను చూపించాడు. వైభవ్, యశస్వి జైస్వాల్‌తో కలిసి 85 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కానీ ఆ భాగస్వామ్యం విజయం సాధించేందుకు సరిపోలేదు. రాయల్స్‌కి లక్నో చేతిలో ఓటమి ఎదురైంది.

ఇదిలా ఉండగా, ఢిల్లీతో మ్యాచ్ తర్వాత సంజు శాంసన్, కోచ్ రాహుల్ ద్రావిడ్ మధ్య విభేదాలున్నాయంటూ సోషల్ మీడియాలో గుసగుసలు ఊపందుకున్నాయి. ఈ వార్తలపై ముందే స్పందించిన రాహుల్ ద్రావిడ్, అవన్నీ ఊహాగానాలేనని స్పష్టంగా చెప్పేశాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఏప్రిల్ 24న బెంగళూరులో ఆర్సీబీతో తలపడనుంది. ఆ మ్యాచ్‌కు సంజు అందుబాటులో ఉండడు. ఆ తర్వాత జట్టు మళ్లీ జైపూర్‌కు చేరుకుని గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. అతను ఆ మ్యాచ్‌కు సరైన సమయానికి కోలుకుంటాడా లేదా అన్నది ఫిజియో నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories