RCB: యశ్‌ దయాల్‌ నువ్వు సూపర్‌ మావా.. ఏకంగా ధోనీనే బోల్తా కొట్టించావుగా!

RCB
x

RCB: యశ్‌ దయాల్‌ నువ్వు సూపర్‌ మావా.. ఏకంగా ధోనీనే బోల్తా కొట్టించావుగా!

Highlights

RCB: ఈ విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్‌ దిశగా పటిష్ట అడుగు వేసినట్లయింది.

RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో మే 4న జరిగిన 52వ మ్యాచ్‌లో చెన్నైపై గెలిచిన బెంగళూరు బలంగా పుంజుకుంది. ముఖ్యంగా చివరి ఓవర్‌లో యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్‌ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్‌కు చెన్నైకు 15 పరుగులు అవసరం. మైదానంలో జడేజా, ధోనీలాంటి అనుభవజ్ఞులుండగా, ఒత్తిడిలోనూ దయాల్ తన ధైర్యాన్ని నిలబెట్టుకున్నాడు.

ఆ ఓవర్‌లో తొలి మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులే ఇచ్చి, ధోనీని ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన శివమ్ దూబే, నాల్గవ బంతిని సిక్సర్‌గా కొట్టాడు. అది నో బాల్ కూడా కావడంతో స్కోరు తేడా ఒక్కసారిగా తగ్గిపోయింది. కానీ చివరి మూడు బంతుల్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చిన దయాల్, మ్యాచ్‌ను బెంగళూరుకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ విజయం తర్వాత బెంగళూరు జట్టు కోచ్ డినేష్ కార్తిక్ యశ్ దయాల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అతని కష్టసాధన, ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు. దయాల్ ప్రతీ మీటింగ్‌కి సన్నద్ధంగా వస్తూ, తన ప్రణాళికలను రాసుకొని అమలు చేసే తత్వాన్ని గుర్తించారు. ఈ మ్యాచ్‌లో దయాల్ నాలుగు ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే చివరి ఓవర్‌లో అతని ప్రదర్శననే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ గెలుపుతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఈ సీజన్‌లో ఇది వారి 11వ మ్యాచ్, 8వ విజయం. ఇక చెన్నై జట్టు మాత్రం ఈ పరాజయంతో చివరి స్థానంలోనే మిగిలింది. యుష్ మ్హాత్రే, జడేజా చేసిన హాఫ్ సెంచరీలు ఫలితం ఇవ్వలేకపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories