కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సంచలన నిర్ణయం

Ravichandran Ashwin
x
Ravichandran Ashwin
Highlights

పొట్టి ఫార్మాట్ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌నే ఏకంగా బదిలీ చేయాలని...

పొట్టి ఫార్మాట్ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌నే ఏకంగా బదిలీ చేయాలని నిర్ణయించుకుని సాహసోపేత నిర్ణయం తీసుకుంది. 2018 నుంచి జట్టుకు సారధిగా మారిన కీలక ఆటగాడు అశ్వీన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి పంపించనుంది.

2018లో కెప్టెన్ గా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వ్యవహరిస్తు వచ్చాడు. అయితే ఐపీఎల్ 2019 సీజన్‌లో 14 మాచ్ లు ఆడిన అశ్విన్ 15 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కెప్టెన్ గా జట్టును ప్లేఆఫ్ కి చేర్చడంలో అశ్వీన్ విఫలమయ్యాడు. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో నిలిచింది. అశ్విన్ తప్పించి మరో ఆటగాడికి టీమ్ పగ్గాలు అప్పగించాలని పంజాబ్ ఫ్రాంఛైజీ ఆలోచిస్తుంది.

ఇటివలే పంజాబ్ టీమ్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా భారత జట్టు మాజీ కెప్టెన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నియామకం అయ్యారు. అంతకు మందు అశ్విన్ ను బదిలీ చేయాలని నిర్ణయించుకున్న జట్టు యాజమాన్యం, కుంబ్లే ఆపరేషన్స్ డైరెక్టర్‌గా వచ్చిన తర్వాత నిర్ణయాన్ని విరమించుకుంది. తాజాగా అశ్విన్ బదిలీపై పంపాలని నిర్ణయించుకుంది. అశ్విన్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మరో ఇద్దరు ఆటగాళ్లను తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఐపీఎల్ 2020 సీజన్ వేలం ముంగిట పంజాబ్ ఈ నిర్ణయం తీసుకోవడంపై అందరూ ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు.

2020 ఐపిఎల్ ప్రారంభం నాటికి అశ్విన్ ఢిల్లీ జట్టు తరుపున ఆడే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించారు. అశ్విన్ రావడం జట్టుకు బలాన్ని చేకురుస్తుందని, బౌలింగ్ మరింత పటిష్టంగా మారుతుందన్నారు. ఢిల్లీ జట్టు యువ ఆటగాళ్లను బదిలీ చేసిన సీనియర్ ఆటగాడు ధావన్ కూడా గతంలో ఇలానే తీసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories