నా కొడుకు ప్రపంచకప్ తెస్తాడని అనుకున్నా.. కానీ..

నా కొడుకు ప్రపంచకప్ తెస్తాడని అనుకున్నా.. కానీ..
x
Highlights

టీమిండియా బంగ్లాదేశ్ మధ్య అండర్ -19 ప్రపంచ కప్‌ ఉత్కంఠ పోరులో భారత్ పరాజయం చెందిన సంగతి తెలిసిందే.

టీమిండియా బంగ్లాదేశ్ మధ్య అండర్-19 ప్రపంచ కప్‌ ఉత్కంఠ పోరులో భారత్ పరాజయం చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌పై టీమిండియా అండర్ -19 జట్టు స్పిన్నర్ రవి బిష్ణోయ్ తండ్రి మంగీలాల్ బిష్ణోయ్ మాట్లాడారు. తన కుమారుడు ప్రపంచకప్‌ తీసుకొస్తాడని భావిచానని, అలా జరగలేదని శాయశక్తులా ప్రయత్నించాడని ఆయన అన్నారు.

కాగా.. మ్యాచ్ ఫైనల్లో భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్‌ చివరివరకు పోరాడి మూడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన కోటా 10 ఓవర్ల బౌల్ చేసి 30 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా బ్యాట్స్‌మన్‌ ఒక దశలో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో షాట్ల ఆడడం పక్కన పెడితే అతని గూగ్లీలు అర్థం కాక తికమకపడ్డారు. బంగ్లా బ్యాట్స్‌మన్‌ సింగిల్స్ కోసం చాలా కష్టపడాల్సొచ్చింది. రవి బిష్ణోయ్‌ కష్టపడినా భారత్ ను మాత్రం గెలిపించలేకపొయాడు.

వరల్డ్‌కప్‌లో రవి బిష్ణోయ్ భారత్ తరఫున ఓ రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నమెంట్‌ మొత్తంలో 17 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. పియూష్ చావ్లా (2006)లో, సందీప్ శర్మ (2012)లో, తర్వాత ఫైనల్లో నాలుగు వికెట్లు తీసిన 3వ భారతీయుడిగా రవి బిష్ణోయ్ రికార్డుల్లోకి నెలకొల్పాడు. అంతకముందు శాలభ్ శ్రీవాస్తవ (2000), అభిషేక్ శర్మ (2002), కుల్దీప్ యాదవ్ (2014), అనుకుల్ రాయ్ (2018) 15 వికెట్లు తీశారు.

అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత రవి బిష్ణోయ్‌ తండ్రి మంగీలాల్ స్పందించారు. ' భారత్ ఓడిపోవడంతో చాలా బాధగా ఉంది. నా కొడుకు భారత్‌కు ప్రపంచకప్‌ తీసుకొస్తాడని ఆశించా.., అలా జరగనప్పటికీ భాగా ప్రయత్నించాడు' అని తెలిపారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ మంగీలాల్ బిష్ణోయ్‌ స్వస్థలం. ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు.

టీమిండియా క్రికెటర్ రవి బిష్ణోయ్ అన్నయ్య అశోక్ బిష్ణోయ్ మాట్లాడుతూ... 'రవి బిష్ణోయ్ టోర్నమెంట్లో మంచి ఆటతీరుతో ఆకట్టుకున్నాడని,సంతోషంగా ఉంది. కానీ.. టైటిల్ మంగిట రవి చేసిన ప్రదర్శన నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకుంది. ప్రపంచకప్‌లో రవి 17 వికెట్లు తీసాడు. రవి ఒక్కడే కాదు మొత్తం జట్టు బాగా ఆడింది. కానీ టీమిండియా ఓడిపోవడం నిరాశ చెందాం' అని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories