
Rashid Khan: రెండుసార్లు విజయం చేజారింది.. కంటతడి పెట్టిన రషీద్ ఖాన్!
Rashid Khan: టీ20 వరల్డ్‌కప్ 2026లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఓటమి పాలైన అనంతరం అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు.
Rashid Khan: టీ20 వరల్డ్‌కప్ 2026లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఓటమి పాలైన అనంతరం అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. రెండుసార్లు విజయం చేజారిందని ఎమోషనల్ అయ్యాడు. అదే సమయంలో జట్టు ప్రదర్శనపై గర్వం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఆటగాళ్లు చేసిన పోరాటం అద్భుతమని ప్రశంసించాడు. ముఖ్యంగా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా 10 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 100 పరుగులు చేసిన స్థితి నుంచి.. 190 లోపే వారిని కట్టడి చేయడం గొప్ప ప్రయత్నమని అన్నాడు. బౌలింగ్ చివరి 10 ఓవర్లలో జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
'పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఈ మైదానంలో ఐపీఎల్లో చాలా మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నందున సగటు స్కోరు 190–195 మధ్య ఉంటుందని ముందే చర్చించుకున్నాము. దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభం దక్కింది. అయినా చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు ఉంటాయని మాట్లాడుకున్నాం. చివరికి లక్ష్యాన్ని చేధించేందుకు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ.. మేము తక్కువ తేడాతో ఓడిపోయామనే బాధ ఉంది. రహ్మనుల్లా గుర్బాజ్ అద్భుతంగా ఆడాడు. టాప్ ఆర్డర్లో విధ్వంసక బ్యాటింగ్ చేయడం అతని ప్రత్యేకత. జట్టుకు అద్భుత ఆరంభం ఇచ్చాడు. పవర్‌ప్లే చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు పడిపోవడంతో గుర్బాజ్‌పై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ అతను పోరాడాడు. రెండో సూపర్ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టడం మ్యాచ్‌ను దగ్గర చేసింది' అని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.
'ఒక్క బంతికి ఐదు పరుగులు కావాల్సిన స్థితి వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చు. కొన్ని సందర్భాల్లో కాస్త తెలివిగా ఆడితే మ్యాచ్‌ను ముగించేయవచ్చు. అయితే ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. వచ్చే మ్యాచులలో మరింత మెరుగ్గా రాణిస్తామనే నమ్మకం ఉంది. జట్టును మానసికంగా నిలబెట్టడం కష్టం. ఈ మ్యాచ్ కోసం ఏడాదిన్నరగా కష్టపడ్డాం. చివర్లో ఓడిపోవడం బాధాకరం. అయినప్పటికీ దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. అభిమానులు విజయాలను ఆశిస్తున్నారు. ప్రపంచకప్‌లో ఇది ఆశించిన ఆరంభం కాకపోయినా తదుపరి మ్యాచ్‌లో తిరిగి రాణించేందుకు ప్రయత్నిస్తాము' అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అఫ్గాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు సూపర్ ఓవర్లు జరిగాయి. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివరకు సఫారీ టీమ్ విజయం సాధించింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




