బెంగళూరు పై రాజస్థాన్ సంచలన విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం...

Rajasthan Royals Won Over Royal Challengers Bangalore In IPL 2022 Match Highlights | Live News Today
x

బెంగళూరు పై రాజస్థాన్ సంచలన విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం...

Highlights

RR vs RCB Highlights: ఆడిన 8 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు...

Rajasthan VS Bangalore: ఐపీఎల్ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ విజయబావుటా ఎగురవేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్ష్యచేదనలో చతికిలపడటంతో రాజస్థాన్ గెలుపు సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. రాజస్థాన్ ఆటగాడు... రియాన్ పరాగ్ అద్భుతమైన ఆటతీరుతో 31 బంతుల్లో 3 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 56 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.

జట్టుస్కోరు పెరుగుదలలో కీలక పాత్ర పోషించాడు. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును రాజస్థాన్ బౌలర్లు ఆటకట్టించారు. కుల్ దీప్ సేన్ 19 బంతుల్లో 20 పరుగులిచ్చి 4 కీలకమైన వికెట్లను పడగొట్టాడు. బౌలర్లు అందూ పొదుపుగా పరుగులిచ్చారు. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు, ప్రసిద్ధ క్రిష్ణ రెండు వికెట్లు పడగొట్టారు. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డుఅందుకున్నాడు.

బెంగళూరు కెప్టన్ డుప్లెసిస్ 23 పరుగులు, వానిందు హసరంగ 18 పరుగులు, షాబజ్ అహ్మద్ 17 పరుగులు, కోహ్లీ 9 పరుగులు నమోదు చేశారు. రాజస్థాన్ విజయం సొంతంచేసుకుని పాయింట్ల పట్టికలో 6 విజయాలతో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories